ఇది విన్నారా? విలన్‌గా ‘సునీల్’

| Edited By:

Dec 29, 2019 | 5:15 PM

ఇప్పటివరకూ ఎన్నో పాత్రల్లో కనిపించిన సునీల్ ఇప్పుడు విలన్‌గా సిల్వర్‌ స్క్రీన్‌పై మెరవనున్నాడు. ప్రస్తుతం ఈ వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. తెలుగు చిత్రసీమలో సునీల్‌కు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న విషయం తెలిసిందే. మొదటి నుంచీ కమేడియన్‌గా అలరించిన సునీల్.. రాజమౌళి డైరెక్షన్‌లో ‘మర్యాద రామన్న’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్ సాధించింది. ఇక అప్పటి నుంచీ హీరోగా చేస్తూ వచ్చాడు సునీల్. అనంతరం చిత్రలహరి సినిమాలో […]

ఇది విన్నారా? విలన్‌గా సునీల్
Follow us on

ఇప్పటివరకూ ఎన్నో పాత్రల్లో కనిపించిన సునీల్ ఇప్పుడు విలన్‌గా సిల్వర్‌ స్క్రీన్‌పై మెరవనున్నాడు. ప్రస్తుతం ఈ వార్త అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

తెలుగు చిత్రసీమలో సునీల్‌కు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న విషయం తెలిసిందే. మొదటి నుంచీ కమేడియన్‌గా అలరించిన సునీల్.. రాజమౌళి డైరెక్షన్‌లో ‘మర్యాద రామన్న’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద సూపర్‌ హిట్ సాధించింది. ఇక అప్పటి నుంచీ హీరోగా చేస్తూ వచ్చాడు సునీల్. అనంతరం చిత్రలహరి సినిమాలో మళ్లీ కమెడియన్‌గా కనిపించి అలరించాడు. అయితే ఇప్పుడు విలన్‌గా దర్శనమివ్వనున్నాడు సునీల్. నవ్వులు కురిపించే ఇతని ముఖంలో జనాలు సీరియస్‌నెస్‌ని చూడగలరా?

‘కలర్ ఫొటో’ పేరుతో తెరకెక్కుతున్న ఓ చిత్రంలో విలన్‌గా సందడి చేయనున్నాడు. ఈ విషయాన్ని కొత్త డైరెక్టర్ సందీప్ రాజ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ని హీరో నాని తాజాగా విడుదల చేశారు. ఇందులో సుహాస్, చాందినీ చౌదరిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.