అభిషేక్ బచ్చన్ కూ కరోనా పాజిటివ్.. ఆస్పత్రిలో చేరిక..

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తరువాత, అతని కుమారుడు అభిషేక్ బచ్చన్ కు కరోనావైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అభిషేక్ ఓ ట్వీట్ లో "ఈ రోజు ముందు మా నాన్న, నేను కోవిడ్ 19 పరీక్షలు చేయించగా,

  • Updated On - 5:53 am, Sun, 12 July 20 Edited By:
అభిషేక్ బచ్చన్ కూ కరోనా పాజిటివ్.. ఆస్పత్రిలో చేరిక..

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ తరువాత, అతని కుమారుడు అభిషేక్ బచ్చన్ కు కరోనావైరస్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అభిషేక్ ఓ ట్వీట్ లో “ఈ రోజు ముందు మా నాన్న, నేను కోవిడ్ 19 పరీక్షలు చేయించగా, తేలికపాటి లక్షణాలు ఉన్న మా ఇద్దరినీ ఆసుపత్రిలో చేర్పించారు. సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చాము. మా కుటుంబం, సిబ్బంది అందరూ పరీక్షించబడుతున్నారు. నేను భయపడకుండా ప్రశాంతంగా ఉండాలని అందరినీ అభ్యర్థిస్తున్నాను. ధన్యవాదాలు. ” అని తెలిపారు.

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ శనివారం సాయంత్రం ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చేరారు. మూత్రపిండాల నొప్పితో అమితాబ్ నానావతి ఆస్పత్రిలో చేరారు. వైద్యులు అమితాబ్ కు కరోనా పరీక్షలు చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

[svt-event date=”12/07/2020,12:10AM” class=”svt-cd-green” ]

[/svt-event]