AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బిరబిరా కృష్ణమ్మ… క‌ృష్ణా బేసిన్‌కు వరద ప్రవాహం

కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. బిరబిరా ప్రవహిస్తోంది. క‌ృష్ణా నదిలోకి వరద ప్రవాహం పెరుగుతోంది. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులు నిండుతుండటం దిగువన ఉన్న ప్రాజెక్టులకు...

బిరబిరా కృష్ణమ్మ...  క‌ృష్ణా బేసిన్‌కు వరద ప్రవాహం
Sanjay Kasula
|

Updated on: Jul 12, 2020 | 6:57 AM

Share

కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. బిరబిరా ప్రవహిస్తోంది. క‌ృష్ణా నదిలోకి వరద ప్రవాహం పెరుగుతోంది. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టులు నిండుతుండటం దిగువన ఉన్న ప్రాజెక్టులకు ఊరటనిస్తోంది. గత 10 రోజులుగా కర్నాటకతోపాటు మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగుతున్నాయి. రహదారులు కొట్టుకుపోతున్నాయి. కృష్ణా బేసిన్ లో కురుస్తున్న వర్షాలతో రిజర్వయర్ లోకి ఇన్ ఫ్లో పెరిగింది. ముఖ్యంగా ఆల్మట్టి జలాశయం నిండుకుండలా మారింది. దిగువ ప్రాంతాల్లోని రైతుల్లో కొత్త ఉత్సాహం నింపింది.

ఆల్మట్టి…

ఆల్మట్టిలో నీటిమట్టం దాదాపు 17 వందల అడుగుల దగ్గరకు చేరుకుంది. 92.5 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 71 శాతానికి పైగా నీరు నిల్వ ఉంది. దీనికి తోడు 25 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ప్రాజెక్టుకు చేరుతోంది. ఇన్ ఫ్లో మరింత పెరగొచ్చని అంచనా వేస్తున్నారు. వరద ప్రవాహం ఇలానే కొనసాగితే మరో నాలుగు రోజులలోనే ఆల్మట్టి పూర్తిగా నిండే అవకాశం ఉంది. దీంతో 22 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలేస్తున్నారు.

నారాయణపూర్..

నారాయణపూర్ వద్ద పరిస్తితి చూస్తే.. దాదాపు 80 శాతం వరకు నిండిపోయింది. ఇక్కడ నీటి నిల్వ 30 టీఎంసీలకు చేరింది. మరో 7 టీఎంసీలు చేరితే పూర్తిగా నిండిపోతుంది. ఎగువ ప్రాంతం నుంచి 25 వేల క్యూసెక్కుల వరద నీరు జలాశయానికి వచ్చి చేరుతోంది. దిగవకు 50 క్యూసెక్కుల నీటి మాత్రమే విడిచిపెడుతున్నారు.

జూరాల…

ఇక జూరాల నిండు కుండలా మారింది. దీని నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు, ఇప్పటికి 80 శాతానికి పైగా నిండింది. మరో 1.5 టీఎంసీల వరద నీరు వస్తే జూరాల పూర్తిగా నిండిపోతుంది. 17 వేల క్యూసెక్కులకు పైగా ఇన్ ఫ్లో ఉండగా… 15 వేల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలేస్తున్నారు.

తుంగభద్ర…

తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తుతోంది. 26 వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో కొనసాగుతోంది. 300 క్యూసెక్కుల మేర బయటకు వదులుతున్నారు.

సుంకేసుల..

ఇక సుంకేసుల విషయానికి వస్తే.. దాదాపు 90 శాతం నిండిపోయింది. దీని పూర్తి సామర్థ్యం1.2 టీఎంసీలుకాగా.. 9,200 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దాదాపు 9వేల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.

శ్రీశైలం..

ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో కృష్ణమ్మకు జల కళ సంతరించుకున్నా.. శ్రీశైలం డ్యాం కు పెద్దగా ఇన్ ఫ్లో లేదు. ఇప్పుడిప్పుడే వరద వస్తోంది. సుకేసుల నుంచి 9 వేల క్యూసెక్కులు, హంద్రీ నుంచి 5.5 క్యూసెక్కుల వరద చేరింది.

నాగార్జున సాగర్..

అటు నాగార్జున సాగర్  పరిస్థితి కూడా అంతే… 500 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. అంతే మొత్తంలో నీటిని దిగువకు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టులో మాత్రం 12 వందల క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద 5,800 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా… 6,800 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.

Follow Us