ఆసుపత్రిలో అర్ధరాత్రి ఇలా వుంది…

|

Aug 01, 2020 | 1:20 AM

ఐసోలేషన్ వార్డులో అభిషేక్ బచ్చన్ ఒంటరిగా ఉంటున్నారు. గదిలో నుంచి బయటకు రావడం లేదట. గదిలోనే యోగ, మెడిటేషన్ చేస్తున్నారట. ఇక రాత్రి సమయంలో..

ఆసుపత్రిలో అర్ధరాత్రి ఇలా వుంది...
Follow us on

Abhishek Shares Glimpse of His Late Night Walks : కరోనా బారిన పడ్డ అమితాబ్ బచ్చన్‌, అభిషేక్ బచ్చన్‌ ప్రస్తుతం నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తమ ఆరోగ్యంపై సోషల్ మీడియా వేదికగా అభిమానులకు సమాచారాన్ని అందిస్తున్నారు వీరిద్దరు. అయితే కొంతమంది నెటిజన్లు రెచ్చిపోతూ వీరిని కించపరుస్తూ కామెంట్లు చేస్తున్నారు. మొన్నటికి మొన్న ఓ నెటిజన్‌.. అమితాబ్‌ కరోనాతో చచ్చిపోతాడంటూ‌ కామెంట్ పెట్టాడు. దానికి ఆయన అదే స్థాయిలో సమాధానం ఇచ్చారు.

ఇదిలావుంటే ఐసోలేషన్ వార్డులో అభిషేక్ బచ్చన్ ఒంటరిగా ఉంటున్నారు. గదిలో నుంచి బయటకు రావడం లేదట. గదిలోనే యోగ, మెడిటేషన్ చేస్తున్నారట. ఇక రాత్రి సమయంలో.. ఆస్పత్రి పరిసరాలు పూర్తి నిర్మానుష్యంగా, నిశ్శబ్దంగా మారిపోతున్నాయని తన ఇన్ట్సాగ్రామ్ ఖాతాలో రాసుకున్నారు.

అయితే రాత్రి సమయంలో తను వాకింగ్ చేస్తున్నానని రాశారు. అర్ధరాత్రి సమయంలో వార్డ్ కారిడార్ ఎలా ఉందో చెప్పారు. ‘లైట్లు వెలుగుతున్న ఓ పెద్ద టన్నెల్’‌లా ఉందని చెప్పుకొచ్చారు. దానికి తనదైన తరహాలో లేట్ నైట్ వాక్ అంటూ యాష్ ట్యాగ్ చేశారు.