చిక్కుల్లో విరాట్ కోహ్లీ.. అరెస్ట్ చేయాలంటూ పిటిషన్.!

భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ చిక్కుల్లో పడ్డాడు. అతన్ని అరెస్ట్ చేయాలంటూ మద్రాస్ హైకోర్టులో లాయర్ సూర్యప్రకాష్ పిటిషన్ దాఖలు చేశారు.

చిక్కుల్లో విరాట్ కోహ్లీ.. అరెస్ట్ చేయాలంటూ పిటిషన్.!
Follow us
Ravi Kiran

|

Updated on: Aug 01, 2020 | 1:00 AM

Petition Filed Seeking Virat Kohli Arrest: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ చిక్కుల్లో పడ్డాడు. అతన్ని అరెస్ట్ చేయాలంటూ మద్రాస్ హైకోర్టులో లాయర్ సూర్యప్రకాష్ పిటిషన్ దాఖలు చేశారు. కోహ్లీ, నటి తమన్నాతో కలిసి ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్’కు సంబంధించిన యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నాడని.. దీని వల్ల యువత తప్పుడు మార్గాన్ని ఎంచుకున్న అవకాశం ఉందని లాయర్ సూర్యప్రకాష్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. అందుకు ఈ మధ్య చోటు చేసుకున్న ఓ సంఘటనను కూడా ఉదాహరణగా చెప్పుకొచ్చాడు. ఇక మద్రాస్ హైకోర్టు ఆగష్టు 4న ఈ పిటిషన్‌పై విచారణ జరపనుంది. కాగా, కోహ్లీ, తమన్నా ఇద్దరు మొబైల్ ప్రీమియర్ లీగ్(ఎంపిఎల్) అనే ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

Also Read:

ఆగష్టు 31 వరకు అంతర్జాతీయ విమానాలు రద్దు.

ఆగష్టు 15 ఏపీ రాజధాని తరలింపు.. పంద్రాగస్టు వేడుకలు అక్కడే…

ఏపీలో కరోనా డేంజర్ బెల్స్.. ఆ నాలుగు జిల్లాలు హైరిస్క్!