నరేంద్ర మోదీజీ ! మీకు మాస్క్ ఏదీ ? ట్రోల్ షురూ చేసిన కేజ్రీవాల్ పార్టీ.. వీడియో సాక్ష్యంగా ఎద్దేవా

| Edited By: Rajesh Sharma

Dec 17, 2020 | 4:56 PM

దేశంలో కోవిడ్ ఇంకా కాస్త ప్రబలంగానే ఉన్న వేళ.. దీని అదుపునకు ప్రతివారూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించే ప్రధాని మోదీయే స్వయంగా ఈ సూచన పాటించకపోవడం విచిత్రమే మరి ! మాస్కులు, శాలువాలు తదితరాలను..

నరేంద్ర మోదీజీ ! మీకు మాస్క్ ఏదీ ? ట్రోల్ షురూ చేసిన కేజ్రీవాల్ పార్టీ.. వీడియో సాక్ష్యంగా ఎద్దేవా
Follow us on

దేశంలో కోవిడ్ ఇంకా కాస్త ప్రబలంగానే ఉన్న వేళ.. దీని అదుపునకు ప్రతివారూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించే ప్రధాని మోదీయే స్వయంగా ఈ సూచన పాటించకపోవడం విచిత్రమే మరి ! మాస్కులు, శాలువాలు తదితరాలను విక్రయించే ఓ మాల్ ను మోదీ ఇటీవల విజిట్ చేసినప్పుడు మాస్క్ లేకుండానే కనిపించారు. పైగా ఓ వలంటీర్ ఇవ్వజూపిన మాస్క్ ను వద్దని అక్కడే ఉంచి ముందుకు సాగారు. ఈ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఢిల్లీ సీఎం, అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ దీన్ని హైలైట్ చేస్తూ..’వేర్ మాస్క్, డోంట్ బీ లైక్ మోదీజీ’ (మాస్క్ ధరించండి,, మోదీజీలా ఉండకండి) అని ట్రోల్ చేసింది. ఈ కరోనా వేళ మాస్క్ వినియోగంపై చైతన్యం పెంచాల్సింది పోయి మీరే ఇలా చేస్తే ఎలా అని ఆప్ ప్రశ్నించింది.

బహుశా హస్తకళా వస్తువులు విక్రయించే స్టాల్ ను మోడీ  సందర్శించినప్పుడు ఈ వీడియోను చిత్రీకరించినట్టు కనిపిస్తోంది. ఇటీవల చాలా సందర్భాల్లో ప్రధాని ముఖానికి మాస్క్ లేకుండానే కనిపిస్తున్నారు. ఢిల్లీ వంటి నగరాల్లో కోవిడ్ కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ పూర్తిగా తగ్గలేదు. గత 24 గంటల్లో దేశంలో 24 వేలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఈ కేసుల సంఖ్య 99.5  లక్షలకు చేరుకుంది. ఈ 24 గంటల్లో 355 మంది కరోనా రోగులు మృతి చెందారు. ఇప్పటివరకు మృత్యువాత పడినవారి సంఖ్య 1,44,451 కి పెరిగింది. అమెరికా తరువాత ఇండియా రెండో వరస్ట్ హిట్ కంట్రీగా మారింది.