అక్కడ 20 ప్లాస్టిక్ బాటిళ్లు ఇస్తే… రోటీ, సలాడ్!

| Edited By: Srinu

Nov 21, 2019 | 7:13 PM

ఆధునిక ప్రపంచంలో ప్లాస్టిక్ అత్యంత ప్రమాదకారిగా మారింది. పర్యావరణానికి ఇది చేసే హాని అంతా ఇంతా కాదు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు ప్లాస్టిక్ వాడకంపై నిషేధాన్ని విధించాయి. దేశంలో ప్లాస్టిక్ కాలుష్య ప్రమాదాన్ని అరికట్టే ప్రయత్నంలో, హర్యానాలోని హిసార్ మునిసిపాలిటీ కేవలం 20 ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లు తీసుకొస్తే రెండు తినుబండారాలను అందిస్తున్నాయి. పర్యావరణాన్ని కాపాడటానికి హిసార్ మునిసిపల్ కార్పొరేషన్ జనతా భోజనాలయ, హౌండా రామ్ దాబాలోని రెండు దాబాలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఒక నివేదిక ప్రకారం, […]

అక్కడ 20 ప్లాస్టిక్ బాటిళ్లు ఇస్తే... రోటీ, సలాడ్!
Follow us on

ఆధునిక ప్రపంచంలో ప్లాస్టిక్ అత్యంత ప్రమాదకారిగా మారింది. పర్యావరణానికి ఇది చేసే హాని అంతా ఇంతా కాదు. ఇప్పటికే చాలా రాష్ట్రాలు ప్లాస్టిక్ వాడకంపై నిషేధాన్ని విధించాయి. దేశంలో ప్లాస్టిక్ కాలుష్య ప్రమాదాన్ని అరికట్టే ప్రయత్నంలో, హర్యానాలోని హిసార్ మునిసిపాలిటీ కేవలం 20 ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లు తీసుకొస్తే రెండు తినుబండారాలను అందిస్తున్నాయి. పర్యావరణాన్ని కాపాడటానికి హిసార్ మునిసిపల్ కార్పొరేషన్ జనతా భోజనాలయ, హౌండా రామ్ దాబాలోని రెండు దాబాలతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఒక నివేదిక ప్రకారం, సూపరింటెండెంట్ ఇంజనీర్ రాంజీ లాల్ మాట్లాడుతూ, ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లను సేకరించే వారు, వాటి కొనుగోలుదారులకు ఉపాధి ఆగిపోయిందని తెలియగానే తమకు ఈ ఆలోచన వచ్చిందని చెప్పారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌పై నిషేధం విధించిన తరువాత, జంక్ డీలర్లు ప్లాస్టిక్ బాటిళ్లను కొనడం మానేశారు, దీని ఫలితంగా నగరం అంతటా ప్లాస్టిక్ చెత్త నిండిపోయింది.

సేకరించిన ఈ ప్లాస్టిక్ బాటిళ్లను మునిసిపల్ కార్పొరేషన్‌కు అప్పగిస్తారు, దీనిని మొక్కలను పెంచడానికి, పాలిథిన్ కంపోస్ట్ తయారీకి ఉపయోగిస్తారు. కొబ్బరి చిప్పలను కూడా అధికారులు సేకరిస్తారని హిసార్ మేయర్ గౌతమ్ సర్దానా తెలిపారు. దాబా యజమానుల ప్రయత్నాలను మేయర్ ప్రశంసించారు. వారు పేద ప్రజలను ఆదుకోవడం ద్వారా చాలా గొప్ప పని చేస్తున్నారని ఆయన ప్రశంసించారు.