తిరుమలలో కలకలం..నిప్పంటించుకున్న భక్తుడు
తిరుమలలో తీవ్ర కలకలం చెలరేగింది. ఓ భక్తుడు అనంతాళ్వార్ తోట వెనుక భాగంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో చుట్టుపక్కల వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే టీటీడీ సెక్యూరిటీకి సమాచారం అందించడంతో..వారు అతడిని రుయా ఆస్పత్రికి తరలించారు. మంటల్లో అతడి శరీరం 80 శాతం వరకు కాలిపోయినట్టు డాక్టర్లు వెల్లడించారు. అయితే అతను ఎవరు? ఎక్కడ్నుంచి వచ్చాడు. తిరుమలలో ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశాడు అనే వివరాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు […]
తిరుమలలో తీవ్ర కలకలం చెలరేగింది. ఓ భక్తుడు అనంతాళ్వార్ తోట వెనుక భాగంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీంతో చుట్టుపక్కల వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే టీటీడీ సెక్యూరిటీకి సమాచారం అందించడంతో..వారు అతడిని రుయా ఆస్పత్రికి తరలించారు. మంటల్లో అతడి శరీరం 80 శాతం వరకు కాలిపోయినట్టు డాక్టర్లు వెల్లడించారు. అయితే అతను ఎవరు? ఎక్కడ్నుంచి వచ్చాడు. తిరుమలలో ఎందుకు ఆత్మహత్యాయత్నం చేశాడు అనే వివరాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.