9 నెల‌ల గ‌ర్భంతో ఉండి కూడా న‌ర్సుగా సేవ‌లు…సీఎం ఫోన్

9 నెల‌ల గ‌ర్భంతో ఉండి కూడా న‌ర్సుగా సేవ‌లు...సీఎం ఫోన్

ఆమె తొమ్మిది నెల‌ల గ‌ర్భిణీ. ఈ స‌మయంలో ఆమెను కుటుంబ సభ్యులు ఎంతో జాగ్ర‌త్తగా చూసుకోవాలి. అడుగు బ‌య‌ట‌పెట్ట‌నివ్వ‌కూడ‌దు. కానీ ప్ర‌స‌వ స‌మయం వ‌చ్చినా న‌ర్సుగా సేవ‌లందిస్తూ వృత్తి ప‌ట్ల త‌న‌కున్న గౌర‌వాన్ని చాటుకుంటుంది ఓ మ‌హిళ‌. తీర్థ‌హ‌ల్లి తాలూకాలోని గ‌జ‌నూర్ గ్రామానికి చెందిన రూపా ప‌ర్వీన్ రావు అనే మ‌హిళ తొమ్మిది నెల‌ల గ‌ర్భిణీగా ఉన్నా..సెల‌వు పెట్ట‌కుండా జ‌య‌చామ రాజేంద్ర గ‌వ‌ర్న‌మెంట్ ఆస్ప‌త్రిలో రోగుల‌కు సేవలందిస్తోంది. క‌రోనా వీర‌విహారం చేస్తోన్న వేళ‌..నిండు గ‌ర్భిణీగా ఉండి కూడా […]

Ram Naramaneni

|

May 12, 2020 | 10:48 PM

ఆమె తొమ్మిది నెల‌ల గ‌ర్భిణీ. ఈ స‌మయంలో ఆమెను కుటుంబ సభ్యులు ఎంతో జాగ్ర‌త్తగా చూసుకోవాలి. అడుగు బ‌య‌ట‌పెట్ట‌నివ్వ‌కూడ‌దు. కానీ ప్ర‌స‌వ స‌మయం వ‌చ్చినా న‌ర్సుగా సేవ‌లందిస్తూ వృత్తి ప‌ట్ల త‌న‌కున్న గౌర‌వాన్ని చాటుకుంటుంది ఓ మ‌హిళ‌. తీర్థ‌హ‌ల్లి తాలూకాలోని గ‌జ‌నూర్ గ్రామానికి చెందిన రూపా ప‌ర్వీన్ రావు అనే మ‌హిళ తొమ్మిది నెల‌ల గ‌ర్భిణీగా ఉన్నా..సెల‌వు పెట్ట‌కుండా జ‌య‌చామ రాజేంద్ర గ‌వ‌ర్న‌మెంట్ ఆస్ప‌త్రిలో రోగుల‌కు సేవలందిస్తోంది. క‌రోనా వీర‌విహారం చేస్తోన్న వేళ‌..నిండు గ‌ర్భిణీగా ఉండి కూడా ఆమె ఆస్ప‌త్రిలో సేవ‌లు చెయ్య‌డం నిజంగా అభినంద‌నీయం.

రూపా ప‌ర్వీన్ రావు మీడియాతో మాట్లాడుతూ..ఎన్నో గ్రామాల ప్ర‌జ‌లు ఈ ఆస్ప‌త్రికి వ‌చ్చి నిత్యం వైద్యం చేయించుకుంటూ ఉంటారు. ప్ర‌జ‌లకు మెడిక‌ల్ స్టాఫ్ సేవ‌లు ఎంతో అవ‌స‌రం. న‌న్ను సెల‌వు పెట్టి..విశ్రాంతి తీసుకోమ‌ని సీనియ‌ర్లు చెప్పారు. కానీ ప్ర‌స్తుతం కరోనా సంక్షోభం ఉన్న నేప‌థ్యంలో సిబ్బంది కొర‌త ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌ల‌కు నేను సేవ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నా.రోజూ ఆరు గంట‌లు వ‌ర్క్ చేస్తున్నా. సీఎం యెడియూర‌ప్ప నాకు ఫోన్ చేసి ప్ర‌శంసించారు. వృత్తిప‌ట్ల ఉన్న నిబద్ద‌త‌ను అభినందించారు. సీఎం కూడా న‌న్ను రెస్ట్ తీసుకోమ‌న్నార‌ని రూపా పర్వీన్ రావు చెప్పింది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu