ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి జరిగింది. బలూచిస్థాన్ రాష్ట్రంలో సైనిక కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో 9మంది సైనికులు మరణించగా.. 11మంది గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ పర్యటకు కొన్ని గంట ముందుగా ఈ దాడి జరగడంతో పాక్ ప్రభుత్వం ఉలిక్కిపడింది. ఈ దాడికి తమదే బాధ్యత అని బలూచిస్థాన్ లిబరేషన్ ఫ్రంట్, బలూచ్ రిపబ్లిక్ గార్డ్స్ సంస్థలు ప్రకటించుకున్నట్లు పాక్ మీడియా పేర్కొంది.