సీఏఏ నేపథ్యంలో.. 80 మంది ముస్లిం నేతల రాజీనామా!

పౌరసత్వం (సవరణ) చట్టాన్ని నిరసిస్తూ మధ్యప్రదేశ్‌లోని బిజెపికి చెందిన 80 మంది ముస్లిం నాయకులు శుక్రవారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు బీజేపీ నూతన అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మత ప్రాతిపదికన ప్రజలను విభజించేందుకే సీఏఏను తీసుకొచ్చారని వారు ఆరోపించారు. సీఏఏ ఇప్పటికే అమల్లోకి రావడంతో తమ మతానికి చెందిన కార్యక్రమాల్లో పాల్గొనడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది దేశాన్ని విభజించే చర్య […]

సీఏఏ నేపథ్యంలో.. 80 మంది ముస్లిం నేతల రాజీనామా!
Follow us

| Edited By:

Updated on: Jan 24, 2020 | 10:26 PM

పౌరసత్వం (సవరణ) చట్టాన్ని నిరసిస్తూ మధ్యప్రదేశ్‌లోని బిజెపికి చెందిన 80 మంది ముస్లిం నాయకులు శుక్రవారం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు బీజేపీ నూతన అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మత ప్రాతిపదికన ప్రజలను విభజించేందుకే సీఏఏను తీసుకొచ్చారని వారు ఆరోపించారు. సీఏఏ ఇప్పటికే అమల్లోకి రావడంతో తమ మతానికి చెందిన కార్యక్రమాల్లో పాల్గొనడం కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇది దేశాన్ని విభజించే చర్య అని, రాజ్యాంగం యొక్క ప్రాథమిక స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉందని వారు వివరించారు. సీఏఏ లాంటి విభజన చట్టాలపై ఇంకా ఎంతకాలం మౌనంగా ఉండాలని ప్రజలు తమను ప్రశ్నిస్తున్నారన్నారు. శరణార్థులు ఏ మతం వారైనా భారత పౌరసత్వం ఇవ్వాల్సిందేనని, కానీ మతం ఆధారంగా వారు ఉగ్రవాదులా? చొరబాటుదారులా? అనేది ఎలా నిర్ణయిస్తారని వారు ప్రశ్నించారు. పార్టీకి రాజీనామా చేసిన వారిలో బీజేపీ ప్రధాన కార్యదర్శి కైలాశ్ విజయ్ వర్గీయకు అత్యంత సన్నిహితంగా ఉండే నేతలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయమై ఆయనను ప్రశ్నించినప్పుడు రాజీనామాల విషయం తన దృష్టికి రాలేదని తెలిపారు.

Latest Articles
స్టన్నింగ్ స్టిల్స్‏తో మాయ చేస్తోన్న రింకు..
స్టన్నింగ్ స్టిల్స్‏తో మాయ చేస్తోన్న రింకు..
దేనికైనా నేను రెడీ.. జ్యోతిక. | కమల్‌ థగ్‌లైఫ్‌ షెడ్యూల్‌ అప్డేట్
దేనికైనా నేను రెడీ.. జ్యోతిక. | కమల్‌ థగ్‌లైఫ్‌ షెడ్యూల్‌ అప్డేట్
ఆ సమయంలో తీవ్ర కడుపునొప్పి వేదిస్తుందా? ఈ పొరబాట్లు చేయకండి..
ఆ సమయంలో తీవ్ర కడుపునొప్పి వేదిస్తుందా? ఈ పొరబాట్లు చేయకండి..
వరుణుడి దెబ్బకు సీఎం రేవంత్ రెడ్డి సభ రద్దు..!
వరుణుడి దెబ్బకు సీఎం రేవంత్ రెడ్డి సభ రద్దు..!
ఒత్తిడి శారీరక ఆరోగ్యంపై ఇంత ప్రభావం చూపుతుందా.? చాలా డేంజర్
ఒత్తిడి శారీరక ఆరోగ్యంపై ఇంత ప్రభావం చూపుతుందా.? చాలా డేంజర్
డయాబెటిస్‌పై మీక్కూడా ఈ అపోహలు ఉన్నాయా.? నిజాలు తెలుసుకోండి
డయాబెటిస్‌పై మీక్కూడా ఈ అపోహలు ఉన్నాయా.? నిజాలు తెలుసుకోండి
వివో నుంచి ప్రీమియం స్మార్ట్ ఫోన్స్‌.. స్టన్నింగ్ డిజైన్‌తో..
వివో నుంచి ప్రీమియం స్మార్ట్ ఫోన్స్‌.. స్టన్నింగ్ డిజైన్‌తో..
చిన్నారి ఇప్పుడు గ్లామరస్ బ్యూటీ.. అందమున్న అదృష్టమే లేదు..
చిన్నారి ఇప్పుడు గ్లామరస్ బ్యూటీ.. అందమున్న అదృష్టమే లేదు..
తెలుగు రాష్ట్రాల్లో చల్ల.. చల్లగా.! ఉరుములు, మెరుపులతో వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో చల్ల.. చల్లగా.! ఉరుములు, మెరుపులతో వర్షాలు
కొత్త టీవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 10వేలలో స్మార్ట్‌ టీవీలు.
కొత్త టీవీ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? రూ. 10వేలలో స్మార్ట్‌ టీవీలు.