విషాదం : ప్రభుత్వ గోశాలలో 78 ఆవులు మృత్యువాత, ‘గోపష్టమి’ ముందు రోజే ఇలా !

|

Nov 22, 2020 | 2:11 PM

రాజస్థాన్‌లో ప్రభుత్వ గోశాలలోని 78 గోవులు అనుమానాస్పదంగా మృతిచెందడంతో తీవ్ర కలకలం చెలరేగింది. చురు జిల్లా బిలియాబస్ రామ్‌పుర గ్రామం...

విషాదం : ప్రభుత్వ గోశాలలో 78 ఆవులు మృత్యువాత, ‘గోపష్టమి’ ముందు రోజే ఇలా !
Follow us on

రాజస్థాన్‌లో ప్రభుత్వ గోశాలలోని 78 గోవులు అనుమానాస్పదంగా మృతిచెందడంతో తీవ్ర కలకలం చెలరేగింది. చురు జిల్లా బిలియాబస్ రామ్‌పుర గ్రామం గో సంరక్షణ కేంద్రంలో 24 గంటల వ్యవధిలోనే 78 ఆవులు చనిపోయాయి. విషాహారం తినడంతోనే గోవులు కన్నుమూసినట్టు స్థానికులు అనుమానిస్తున్నారు. శుక్రవారం రాత్రి నుంచి ఇప్పటి వరకు 78 ఆవులు చనిపోగా.. మరికొన్ని తీవ్ర అస్వస్థతకు గురై ప్రాణాపాయంలో ఉన్నాయి.

కలుషితం ఆహారం తినడంతోనే ఆవులు చనిపోయినట్టు ప్రాథమికంగా నిర్ధారించినట్టు రాష్ట్ర పశు సంవర్ధక విభాగం తెలిపింది. ఈ క్రమంలో వెంటనే అలెర్టైన అధికారులు ఆవుల మృత్యువాతకు గల కారణాలను అధ్యయనం చేయడానికి అక్కడికి ఒక టీమ్‌ను పంపారు.  ఆవులకు వేసే దాణా, గడ్డి శాంపిల్స్ సేకరించి, టెస్టులు కోసం ల్యాబ్‌కు తరలించారు.  ‘గోపష్టమి’ ముందు రోజే పెద్ద సంఖ్యలో ఆవులు చనిపోవడం కీడు శంకిస్తుందని పలువురు అంటున్నారు.  కాగా ఇటీవల హర్యానాలోని పంచకులలో మాతా మాన్సాదేవి గోశాలలో 70 గోవులు  చనిపోవడం కూడా సంచలనం రేపిన విషయం తెలిసిందే.

Also Raed :

జీహెచ్‌ఎంసీ పోలింగ్‌..డిసెంబర్ 1న సెలవు దినంగా ప్రకటించిన ప్రభుత్వం

చనిపోయినా మరికొందరి జీవితాల్లో వెలుగులు, కానిస్టేబుల్​ అంత్యక్రియల్లో పాల్గొన్న సీపీ సజ్జనార్