
గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు సమీపంలోని వేద పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది. వేద పాఠశాలలో ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన విద్యార్థులు పాఠాలు నేర్చుకుంటారు. వీరు ప్రతిరోజు సాయంత్రం సంధ్యావందనం చేయడానికి కృష్ణానదికి వెళతారు. శుక్రవారం ఏడుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు కృష్ణా నదికి వెళ్ళారు. ఆ తర్వాత స్నానం చేస్తుండగా విద్యార్థులు ఒకరి తర్వాత మరొకరు నీటిలో మునిగిపోయారు. మొత్తం ఐదుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు నీటిలో మునిగి చనిపోయారు. ఇద్దరిని స్థానికులు కాపాడారు. ఆరుగురు మృతదేహాలను స్థానికులు నీటి నుండి వెలికి తీశారు. మృతులంతా శృంగేరి పీఠం వేదపాఠశాల విద్యార్థులుగా గుర్తించారు. మృతులు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ విద్యార్థులుగా తెలుస్తోంది.
Also Read: Adilabad: యూట్యూబ్ చూసి బ్రకోలి సాగు.. లక్షల్లో లాభాలు గడిస్తోన్న రైతు
చిన్నారి ప్రయాణిస్తోన్న కార్ మాత్రమే కాదు.. తన మనసు కూడా చాలా రిచ్.. మనసును కదిలించే వీడియో