డిశ్చార్జ్ అయిన 5 గురు కరోనా బాధితులకు.. 10 రోజుల్లో మళ్ళీ పాజిటివ్!

| Edited By:

Jul 15, 2020 | 8:29 AM

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఒకసారి క‌రోనా నుంచి కోలుకున్న బాధితులు తిరిగి పాజిటివ్‌గా మారుతున్న ఉదంతాలు కూడా చోటుచేసుకుంటున్నాయి.

డిశ్చార్జ్ అయిన 5 గురు కరోనా బాధితులకు.. 10 రోజుల్లో మళ్ళీ పాజిటివ్!
Follow us on

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. అయితే ఒకసారి క‌రోనా నుంచి కోలుకున్న బాధితులు తిరిగి పాజిటివ్‌గా మారుతున్న ఉదంతాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇటువంటి కేసులు పంజాబ్‌లో వెలుగు చూశాయి. ఇంతకుముందు కరోనా పాజిటివ్ అయిన 5 గురు బాధితులు కోలుకొని, డిశ్చార్జ్ అయిన త‌రువాత తిరిగి వ్యాధి బారిన పడ్డారు. మొహాలికి చెందిన 5 గురు బాధితులు చికిత్స తీసుకుని, వారి రిపోర్టు నెగిటివ్ వ‌చ్చిన త‌రువాత డిశ్చార్జ్ అయ్యారు.

అయితే.. ఎలాంటి లక్షణాలు లేకుండానే 10 రోజుల తరువాత వారు తిరిగి కోవిద్-19 పాజిటివ్‌గా మారారు. వైద్యుల‌ను సంప్ర‌దించ‌గా, కరోనా బాధితుల‌ విష‌య‌మై ప్ర‌భుత్వం జారీ చేసిన కొత్త మార్గదర్శకాల ప్రకారం బాధితుడు వ్యాధి నుంచి కోలుకున్న తర్వాత తప్పనిసరిగా ఒక వారం రోజులు హోం క్వారంటైన్‌లో ఒంటరిగా ఉండాల‌ని మొహాలి ఆసుప‌త్రికి చెందిన‌ సివిల్ సర్జన్ డాక్టర్ మంజిత్ సింగ్ స్పష్టం చేశారు. కోలుకున్న తర్వాత కూడా క‌రోనా టెస్టు చేయాల్సినవ‌స‌రం ఉండ‌ద‌న్నారు. ఇంతకుముందు కూడా హిమాచల్‌ప్రదేశ్, కేరళలో ఇలాంటి కేసులు నమోదయ్యాయి.

Also Read: విట్,  ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీల బీటెక్‌ ప్రవేశపరీక్షలు రద్దు..!