ఓ వైపు కరోనా విళయ తాండవం.. మరోవైపు భూకంపం..!
ప్రపంచ దేశాలన్నింటినీ కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోంది. ఇప్పటికే దాదాపు ముప్పై నాలుగు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. వీరిలో రెండున్నర లక్షల వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో పది లక్షల మంది వరకు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే పలు దేశాల్లో కరోనాతో పాటు.. ప్రకృతి కూడా వణికిస్తోంది. తాజాగా ప్యూర్టోరికో ప్రజలు ఓ వైపు కరోనాతో భయపడిపోతుంటే.. తాజాగా దక్షిణ ప్యూర్టోరికో ప్రాంతంలో భూకంపం […]

ప్రపంచ దేశాలన్నింటినీ కరోనా మహమ్మారి గజగజ వణికిస్తోంది. ఇప్పటికే దాదాపు ముప్పై నాలుగు లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. వీరిలో రెండున్నర లక్షల వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో పది లక్షల మంది వరకు కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే పలు దేశాల్లో కరోనాతో పాటు.. ప్రకృతి కూడా వణికిస్తోంది. తాజాగా ప్యూర్టోరికో ప్రజలు ఓ వైపు కరోనాతో భయపడిపోతుంటే.. తాజాగా దక్షిణ ప్యూర్టోరికో ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్‌పై 5.5 తీవ్రత నమోదైంది. దీంతో పలుచోట్ల ఇళ్లతో పాటు.. పెద్ద పెద్ద భవనాలు ధ్వంసమయ్యాయి. అయితే అదృష్టవషాత్తుల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. గ్వానికా, గ్వానిల్లా నగరాలతోపాటు తీరప్రాంతంలో కూడా భూకంపం సంభవించినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది.
ఇదిలా ఉంటే.. ఇదే ప్రాంతంలో ఈ సంవత్సర ఆరంభంలో కూడా భూకంపం సంభవించడంతో.. వందల ఇళ్లు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. జనవరిలో వచ్చిన ఈ భూకంపంతో కొన్ని మిలియన్ డాలర్ల నష్టం వాటిళ్లింది. తాజాగా మరోసారి రావడతో ప్రజలు వణికిపోతున్నారు. ప్రస్తుతం కరోనా కట్టడిలో భాగంగా ప్యూర్టోరికోలో దాదాపు రెండు నెలలుగా లాక్‌డౌన్ కొనసాగుతోంది.