అండమాన్ దీవుల్లో భూకంపం

| Edited By:

Apr 19, 2019 | 7:59 AM

శుక్రవారం తెల్లవారుజామున అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.1 గా నమోదైందని భారత వాతావరణశాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున 3.27 గంటలకు పదికిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని అధికారులు చెప్పారు. ఈ భూకంపం ప్రభావం వల్ల ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించలేదు. భూకంపం ప్రభావిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల్లో ఏప్రిల్ 1వతేదీనుంచి ఇప్పటివరకు భూమి 20 సార్లు కంపించిందని అధికారులు స్పష్టం చేశారు. […]

అండమాన్ దీవుల్లో భూకంపం
Follow us on

శుక్రవారం తెల్లవారుజామున అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభవించింది. అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 5.1 గా నమోదైందని భారత వాతావరణశాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం తెల్లవారుజామున 3.27 గంటలకు పదికిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని అధికారులు చెప్పారు. ఈ భూకంపం ప్రభావం వల్ల ఎలాంటి ప్రాణనష్టం, ఆస్తినష్టం సంభవించలేదు. భూకంపం ప్రభావిత ప్రాంతమైన అండమాన్ నికోబార్ దీవుల్లో ఏప్రిల్ 1వతేదీనుంచి ఇప్పటివరకు భూమి 20 సార్లు కంపించిందని అధికారులు స్పష్టం చేశారు.