జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు.. ఒంటిగంట వరకు 45 శాతం పోలింగ్ నమోదు

జార్ఖండ్ లోని 15 నియోజకవర్గాల్లో జరుగుతున్న నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికల్లో సోమవారం మధ్యాహ్నం 1 గంట వరకు 44.65 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ గిరిదిహ్, డియోఘర్, ధన్‌బాద్, బొకారో జిల్లాల్లోని నియోజకవర్గాల్లో శాంతియుతంగా జరుగుతోందని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు జమువా, బాగోదర్, గిరిదిహ్, డుమ్రీ, తుండి వద్ద ఓటింగ్ ముగుస్తుందని, మిగిలిన నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని వారు పేర్కొన్నారు. కాగా.. గిరిదిహ్ […]

జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు.. ఒంటిగంట వరకు 45 శాతం పోలింగ్ నమోదు
Follow us

| Edited By:

Updated on: Dec 16, 2019 | 3:32 PM

జార్ఖండ్ లోని 15 నియోజకవర్గాల్లో జరుగుతున్న నాలుగో దశ అసెంబ్లీ ఎన్నికల్లో సోమవారం మధ్యాహ్నం 1 గంట వరకు 44.65 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ గిరిదిహ్, డియోఘర్, ధన్‌బాద్, బొకారో జిల్లాల్లోని నియోజకవర్గాల్లో శాంతియుతంగా జరుగుతోందని అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు జమువా, బాగోదర్, గిరిదిహ్, డుమ్రీ, తుండి వద్ద ఓటింగ్ ముగుస్తుందని, మిగిలిన నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని వారు పేర్కొన్నారు.

కాగా.. గిరిదిహ్ జిల్లాలోని జామువా నియోజకవర్గంలో 50, 51 బూత్ నంబర్లలోని ఓటర్లు విలేకరులతో మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో అభివృద్ధి “లేకపోవడం” కారణంగా చాలా మంది ఓటు వేయడానికి ఇష్టపడడంలేదని తెలిపారు. అధికారులు ఓటు ప్రాముఖ్యత గురించి వారిని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నారు. మిగిలిన పదహారు నియోజకవర్గాలకు చివరి దశ పోలింగ్ డిసెంబర్ 20 న జరుగనుంది. ఫలితాలు డిసెంబర్ 23 న వెలువడనున్నాయి.