ఉగ్రవేట… షోపియాన్‌లో భారీ ఎన్ కౌంటర్..

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట కోనసాగుతోంది. షోపియాన్ జిల్లా ధరమ్‌డోర కీగం ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున ఉగ్రవాదులకు, భద్రతా దళాలకు మధ్య హోరాహోరి కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ప్రస్తుతం ఇంకా ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. కాగా చనిపోయిన ఉగ్రవాదులు.. ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవారనేది గుర్తించాల్సి ఉంది. ఘటనాస్థలి నుంచి పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. మిగతా ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

ఉగ్రవేట... షోపియాన్‌లో భారీ ఎన్ కౌంటర్..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jun 23, 2019 | 10:46 AM