సేవలు సులభతరం.. సికింద్రాబాద్ స్టేషన్‌లో 3డి మోడల్ డిస్‌ప్లే
స్టేషన్‌లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను ప్రయాణీకులు సులభతరంగా గుర్తించడానికి, సికింద్రాబాద్ డివిజన్ ఒక వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. అక్కడ అందుబాటులో ఉన్న అన్ని సౌకర్యాలను కవర్ చేసే 3 డి మోడల్ స్టేషన్‌ను అభివృద్ధి చేసింది.

స్టేషన్‌లో అందుబాటులో ఉన్న సౌకర్యాలను ప్రయాణీకులు సులభతరంగా గుర్తించడానికి, దక్షిణమధ్య రైల్వే జోన్ ప్రధాన కేంద్రం సికింద్రాబాద్ డివిజన్ ఒక వినూత్న ఆలోచనతో ముందుకు వచ్చింది. అక్కడ అందుబాటులో ఉన్న అన్ని సౌకర్యాలను కవర్ చేసే 3 డి మోడల్ స్టేషన్‌ను అభివృద్ధి చేసింది. సికింద్రాబాద్ స్టేషన్‌లో 10వ నెంబరు ప్లాట్‌ఫాంపై దీన్ని ఏర్పాటు చేశారు. కాజీపేటలోని డీజిల్ లోకో షెడ్ సిబ్బంది దీనిని దేశీయంగా అభివృద్ధి చేశారు.
సాత్ సెంట్రల్ రైల్వే అధికారులు చెప్పిన వివరాల ప్రకారం.. 3 డి మోడల్ యంత్రంలో మొత్తం 24 బటన్లు ఉంటాయి. ప్రతి బటన్ స్టేషన్ లే-అవుట్‌లోని ప్రత్యేక ఫెసిలిటీకి అనుసంధానమై ఉంటుంది. వీటిని నొక్కగానే ప్రయాణికులకు స్ర్కోలింగ్ రూపంలో సూచనలు డిస్ ప్లే అవుతాయి. ఆ వసతి ఉన్న చోట రెడ్ లైట్ మెరుస్తూ ఫ్లాట్‌ఫాంపై ఎక్కడుందో చూపిస్తుంది. ప్రయాణీకులు ఈజీగా ఆపరేట్ చేసుకోగలిగే యూజర్ ఫ్రెండ్లీ పరికరాలు ఈ యంత్రంలో అమర్చారు. కీబోర్డ్ సహాయంతో.. స్టేషన్ ప్రాంగణంలో రిటైర్ గదులు, హెల్ప్ డెస్క్, వీల్‌చైర్లు, వెయిటింగ్ హాల్స్, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్, రిఫ్రెష్‌మెంట్ స్టాల్స్, వాటర్ ట్యాప్స్ వంటి అన్ని ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉన్న అన్ని ప్రయాణీకుల సౌకర్యాలను గుర్తించడంలో ఈ మోడల్ సహాయపడుతుంది.




