ఆ జిల్లాలో నేడు 367 కరోనా కేసులు.. వాటిని కంటైన్మెంట్ గా ప్రకటిస్తాం..: కలెక్టర్

| Edited By:

Jul 14, 2020 | 5:48 AM

దేశంలో కోవిద్-19 కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఏపీలో రానురాను కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా ఈస్ట్ గోదావరి జిల్లాలో నేడు 367 కరోనా కేసులు

ఆ జిల్లాలో నేడు 367 కరోనా కేసులు.. వాటిని కంటైన్మెంట్ గా ప్రకటిస్తాం..: కలెక్టర్
Follow us on

దేశంలో కోవిద్-19 కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తోంది. ఏపీలో రానురాను కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా ఈస్ట్ గోదావరి జిల్లాలో నేడు 367 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,539 కు చేరినట్లు జిల్లా కలెక్టర్‌ తెలిపారు.ప్రస్తుతం 1883 యాక్టివ్ కేసులు ఉండటంతో రేపటి నుంచి జిల్లా వ్యాప్తంగా పలు ఆంక్షలతో కూడిన నిబంధనలు అమలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో 20కి పైగా పాజిటివ్ కేసులు నమోదైన గ్రామాలను పూర్తిగా కంటోన్మెంట్ జోన్ గా ప్రకటిస్తామని ఆయన తెలిపారు.

కరోనా కట్టడికోసం జిల్లాలో ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకే దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఉందని, మెడికల్ షాపులు నిత్యావసరాల దుకాణాలకు మాత్రమే మినహాయింపు ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. ఆదివారం మటన్, చికెన్ షాపులు, చేపల మార్కెట్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు.

Also Read: యాప్‌ల నిషేధంపై.. చైనాకు ఇండియా ధీటుగా జవాబు