బీహార్‍లోని వైశాలిలో భారీ ‘ఎన్‍కౌంటర్’

బీహార్‍లోని వైశాలిలో భారీ ఎన్‍కౌంటర్ జరిగింది. పోలీసులతో జరిగిన ఎన్‍కౌంటర్‍లో ముగ్గురు గ్యాంగ్‍స్ట‌ర్లు హతమయ్యారు. మరో ముగ్గురు ముఠా సభ్యులు పోలీసులకు చిక్కారు. భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దెశవ్యాప్తంగా జరిగిన పలు దోపిడీల్లో ఈ ముఠాకు హస్తమున్నట్లు గుర్తించారు. బంగారం దుకాణాలను ఈ ముఠా టార్గెట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఖచ్చితమైన సమాచారంతో పోలీసులు ముఠా స్థావరాన్ని చుట్టుముట్టారు. ముఠా సభ్యులు పోలీసుల పైకి కాల్పులు జరిపారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు దుండగులు […]

బీహార్‍లోని వైశాలిలో భారీ ఎన్‍కౌంటర్

Edited By:

Updated on: Mar 17, 2019 | 5:40 PM

బీహార్‍లోని వైశాలిలో భారీ ఎన్‍కౌంటర్ జరిగింది. పోలీసులతో జరిగిన ఎన్‍కౌంటర్‍లో ముగ్గురు గ్యాంగ్‍స్ట‌ర్లు హతమయ్యారు. మరో ముగ్గురు ముఠా సభ్యులు పోలీసులకు చిక్కారు. భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దెశవ్యాప్తంగా జరిగిన పలు దోపిడీల్లో ఈ ముఠాకు హస్తమున్నట్లు గుర్తించారు.

బంగారం దుకాణాలను ఈ ముఠా టార్గెట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఖచ్చితమైన సమాచారంతో పోలీసులు ముఠా స్థావరాన్ని చుట్టుముట్టారు. ముఠా సభ్యులు పోలీసుల పైకి కాల్పులు జరిపారు. పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు దుండగులు చనిపోయారు. రెండుఏకే 47 రైఫిళ్ళతో పాటు మూడు రివాల్వర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.