‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’కి భారీ భద్రత..!

గుజరాత్‌లోని కెవాడియాలో ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ పేరుతో నిర్మించిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహంను పటేల్ 143వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ 2018, అక్టోబర్ 31న ఆవిష్కరించారు. ఈ విగ్రహం వద్ద సీఐఎస్‌ఎఫ్

‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’కి  భారీ భద్రత..!

Edited By:

Updated on: Aug 19, 2020 | 10:43 PM

గుజరాత్‌లోని కెవాడియాలో ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ పేరుతో నిర్మించిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహంను పటేల్ 143వ జయంతి సందర్భంగా ప్రధాని మోదీ 2018, అక్టోబర్ 31న ఆవిష్కరించారు. ఈ విగ్రహం వద్ద సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బందిని మోహరించడానికి కేంద్ర హోం  మంత్రిత్వశాఖ అనుమతినిచ్చింది. మొదటి దశలో భాగంగా ఆగస్టు 25 నుంచి 272 మంది సిబ్బందితో భారీ భద్రతను ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు సీఐఎస్ఎఫ్ డీజీ రాజేశ్ రంజన్‌కు లేఖ రాసినట్టు హోంశాఖ పేర్కొంది. దేశరాజధానిలోని కీలక ప్రభుత్వ కార్యాలయాలు, ఢిల్లీ మెట్రో స్టేషన్లు, దేశంలోని అన్ని విమానాశ్రయాల్లో సీఐఎస్‌ఎఫ్‌ దళాలు భద్రతను పర్యవేక్షిస్తున్నాయి.

Read More:

ఏపీలోని ఆ జిల్లాలో.. 50 ఏళ్లు పైబడిన వారికి.. నో హోమ్‌ ఐసోలేషన్‌..!

జూరాలకు వరద ఉదృతి.. 39 గేట్లు ఎత్తివేత..!