గ్రేటర్ ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లలో 25 మంది నేరచరిత్ర కలిగిన వారున్నారు. బీజేపీ నుంచి 10 మంది, టీఆర్‌ఎస్ నుంచి 8 మంది, ఎంఐఎం పార్టీ తరుఫున గెలిచినవారిలో ఏడుగురు కార్పొరేటర్లు ఆ లిస్ట్‌లో ఉన్నారు. పోయినసారి 30 మంది నేరచరితులు ఉన్నారని, ఈ సారి ఆ సంఖ్య తగ్గిందని ఎఫ్‌జీజీ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి శనివారం పేర్కొన్నారు.