
కోవిద్-19 భారతదేశంలో రోజురోజుకూ విజృంభిస్తోంది. అమెరికా, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, ఇరాన్.. ఇలాంటి అభివృద్ధి చెందిన దేశాలన్నీ కరోనా దెబ్బకు విలవిలలాడుతున్నాయి. మలక్‌పేట క్లస్టర్ పరిధిలోని శాలివాహననగర్, మాదన్నపేట, మలక్‌పేట, గడ్డిఅన్నారం, జాంబాగ్ పార్క్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో విదేశాల నుంచి వచ్చిన 203మంది ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ఇంకా 21మంది జాడ తెలియరాలేదు. ఇప్పటికే 181మంది హోం క్వారంటైన్‌లో ఉన్నారు.
కాగా.. అమెరికా నుంచి వచ్చి మాదన్నపేట పూర్ణోదయకాలనీలో నివాసముంటున్న వ్యక్తికి జరిపిన వైద్యపరీక్షల్లో పాజిటివ్ వచ్చినప్పటికీ బహిరంగంగా సంచరిస్తున్నట్లు గుర్తించిన వైద్య బృందం పోలీసుల సహాయంతో వికారాబాద్‌లోని ఐసోలేషన్ సెంటర్‌కు తరలించారు. అనంతరం దాదాపు 258మంది వైద్య సిబ్బంది పూర్ణోదయకాలనీలోని 3,785ఇళ్లలోని వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు.