ఈ ఏడాది ప్రభుత్వ పురస్కారాలు రద్దు చేసిన ఏపీ ప్ర‌భుత్వం..

|

Jul 06, 2020 | 7:26 AM

ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది ప్ర‌భుత్వ పురస్కారాల‌ను ర‌ద్దు చేసింది. వివిధ రంగాల్లో అత్యుతున్న సేవ‌లంధించిన వ్య‌క్తుల‌కు/ సంస్థలకు పుర‌స్కారాలు ఇవ్వ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే.

ఈ ఏడాది ప్రభుత్వ పురస్కారాలు రద్దు చేసిన ఏపీ ప్ర‌భుత్వం..
Follow us on

ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది ప్ర‌భుత్వ పురస్కారాల‌ను ర‌ద్దు చేసింది. వివిధ రంగాల్లో అత్యుతున్న సేవ‌లందించిన‌ వ్య‌క్తుల‌కు/ సంస్థలకు పుర‌స్కారాలు ఇవ్వ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. అయితే 2020-21 సంవత్సరానికిగానూ ఏపీ స‌ర్కార్ ఈ కార్య‌క్ర‌మాన్ని రద్దు చేసింది. కోవిడ్-19 వ్యాప్తితో రాష్ట్రం అత‌లాకుత‌లం అవుతోన్న వేళ జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా గ‌వ‌ర్న‌మెంట్ ఈ నిర్ణ‌యం తీసుకుందని సమాచార, పౌరసంబంధాల శాఖ ప్రకటన విడుద‌ల చేసింది.

మ‌రోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఆదివారం కొత్తగా 998 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ ద్వారా తెలిపింది. . అందులో ఏపీలోని వారికి 961, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 37, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో ఒకరికి క‌రోనా సోకినట్లు తేలింది. అలాగే మ‌రో 14 మంది(కర్నూలులో 5, అనంతపూర్‌లో 3, చిత్తూరులో 2, కడపలో 2, కృష్ణలో ఒకరు, విశాఖ పట్నంలో ఒకరు) క‌రోనా కార‌ణంగా మృతి చెందారు. కాగా రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 18,697కి చేరింది. అలాగే ఇప్పటివరకూ ఏపీలో మొత్తం 232 మంది కోవిడ్-19 కార‌ణంగా మృతి చెందారు.