ఈశాన్యంలో టెర్రర్ అటాక్…ఇద్దరు జవాన్ల వీరమరణం

ఈశాన్యంలో ఉగ్రవాదులు పంజా విసిరారు. నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో శనివారం అసోం రైఫిల్స్ కాన్వాయ్‌పై దాడి జరిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు, ఆరుగురు గాయపడ్డారు. ఎన్ఎస్‌సీఎన్ తీవ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. మోన్ జిల్లాలో టోబు, ఉఖా గ్రామాల మధ్య అస్సాం రైఫిల్స్ వాహన శ్రేణిపై దాడి జరిగిందని రక్షణ శాఖ అధికార ప్రతినిథి తెలిపారు. తీవ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఇద్దరు జవాన్లు మరణించారని, ఆరుగురు గాయపడ్డారని తెలిపారు. సంఘటనా స్థలానికి […]

ఈశాన్యంలో టెర్రర్ అటాక్...ఇద్దరు జవాన్ల వీరమరణం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: May 26, 2019 | 7:51 AM

ఈశాన్యంలో ఉగ్రవాదులు పంజా విసిరారు. నాగాలాండ్‌లోని మోన్ జిల్లాలో శనివారం అసోం రైఫిల్స్ కాన్వాయ్‌పై దాడి జరిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు జవాన్లు అమరులయ్యారు, ఆరుగురు గాయపడ్డారు. ఎన్ఎస్‌సీఎన్ తీవ్రవాదులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

మోన్ జిల్లాలో టోబు, ఉఖా గ్రామాల మధ్య అస్సాం రైఫిల్స్ వాహన శ్రేణిపై దాడి జరిగిందని రక్షణ శాఖ అధికార ప్రతినిథి తెలిపారు. తీవ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో ఇద్దరు జవాన్లు మరణించారని, ఆరుగురు గాయపడ్డారని తెలిపారు. సంఘటనా స్థలానికి అదనపు బలగాలను తరలించారు. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. మయన్మార్ సరిహద్దులో అలర్ట్ ప్రకటించారు.