ఏపీలో ‘ లక్ష్మీస్ ఎన్టీఆర్ ‘ వచ్చేస్తోంది
హమ్మయ్య ! ఏపీలో ‘ లక్ష్మీస్ ఎన్టీఆర్ ” సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఇప్పటివరకు ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులో ఉన్న కారణంగా ఈ మూవీ విడుదల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎన్నికలు ముగిశాయి గనుక ఇక కోడ్ ‘ అడ్డు ‘ తొలగిపోవడంతో ఈ సినిమాను ఈ నెల 31న అక్కడ విడుదల చేస్తున్నట్టు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. ఈ నెల 30 న వైసీపీ అధినేత […]
హమ్మయ్య ! ఏపీలో ‘ లక్ష్మీస్ ఎన్టీఆర్ ” సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఇప్పటివరకు ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులో ఉన్న కారణంగా ఈ మూవీ విడుదల వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎన్నికలు ముగిశాయి గనుక ఇక కోడ్ ‘ అడ్డు ‘ తొలగిపోవడంతో ఈ సినిమాను ఈ నెల 31న అక్కడ విడుదల చేస్తున్నట్టు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. ఈ నెల 30 న వైసీపీ అధినేత జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారని, అందువల్ల ఆ మరుసటిరోజున ‘ లక్ష్మీస్ ఎన్టీఆర్ ‘ చిత్రం విడుదల అవుతుందన్నారు. ఈ రెండు కార్యక్రమాలూ వైఎస్సార్, ఎన్టీఆర్ ఆశీస్సులతో జరుగుతాయని వర్మ తెలిపాడు. తాజా ఎన్నికల్లో టీడీపీ ఓటమితో వర్మ ఫుల్ ఖుషీగా ఉన్నాడు. తన సినిమాను ఏపీలో విడుదల కాకుండా అడ్డుకున్నది టీడీపీ నేతలేనని ఆయన ఆరోపించిన సంగతి తెలిసిందే..
Y S JAGAN Swearing in as CM on May 30th and #LakshmisNTR is releasing on MAY 31st, both with the blessings of YSR and NTR ? pic.twitter.com/4t4tkc9nLg
— Ram Gopal Varma (@RGVzoomin) May 25, 2019