ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేయకండి – హైపర్ ఆది
2019 ఎన్నికల్లో హీరో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తొలిసారి పోటీ చేసి ఓటమి పాలైంది. ‘వస్తున్నాం.. మారుస్తున్నాం’ అనే నినాదంతో జనసేనాని ప్రజల్లోకి వెళ్లినప్పటికీ వారి నుంచి మాత్రం పెద్దగా మద్దతు లభించలేదని చెప్పాలి. ఇక ఈ విషయాన్ని గురువారం వెలువడిన ఫలితాలు స్పష్టంగా చెబుతున్నాయి. ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన కమెడియన్ హైపర్ ఆది ఎన్నికల ప్రచార సమయంలో జనసేన పార్టీ తరుపున పాల్గొని పెద్ద ఎత్తున ప్రచారం […]
2019 ఎన్నికల్లో హీరో పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ తొలిసారి పోటీ చేసి ఓటమి పాలైంది. ‘వస్తున్నాం.. మారుస్తున్నాం’ అనే నినాదంతో జనసేనాని ప్రజల్లోకి వెళ్లినప్పటికీ వారి నుంచి మాత్రం పెద్దగా మద్దతు లభించలేదని చెప్పాలి. ఇక ఈ విషయాన్ని గురువారం వెలువడిన ఫలితాలు స్పష్టంగా చెబుతున్నాయి.
ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయిన కమెడియన్ హైపర్ ఆది ఎన్నికల ప్రచార సమయంలో జనసేన పార్టీ తరుపున పాల్గొని పెద్ద ఎత్తున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఓటర్లు ఇచ్చిన తీర్పుకు ఆయన ట్విట్టర్ ద్వారా ప్రజలను ఉద్దేశించి వివాదాస్పద ట్వీట్స్ చేసినట్లు కొద్ది రోజులుగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ఇక ఈ వార్తలపై స్పందిస్తూ ఆది ఇటీవల సోషల్ మీడియాలో ఓ వీడియోను రిలీజ్ చేశాడు.
‘నా పేరుమీద ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఫేక్ పోస్టులు పెడుతున్నారు. అవేవి నమ్మకండి. నాకు ఏ అకౌంట్లు లేవు. ముఖ్యంగా 30వ తేదీన ముుఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తున్న వైఎస్ జగన్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలాగే పవన్‌కళ్యాణ్ గారికి ఓటేసిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. రాజకీయాల్లో గెలుపోటములు సహజం. ఓటమిని అంగీకరించాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. ఎలక్షన్ అయిపోయింది కాబట్టి అందరూ ప్రశాంతంగా ఉండండి. ఎవరూ ఎవరి మీదా నెగిటివ్ పోస్టులు పెట్టకండి. థాంక్యూ’ అంటూ హైపర్ ఆది వీడియోలో జనసైనికులకు సూచించారు.
https://www.facebook.com/ItsHyperAadi/videos/471131660305276/