లాక్‌డౌన్‌ కాలంలో పెరిగిన ఆత్మహత్య, గృహ హింస కేసులు..

| Edited By:

Jun 29, 2020 | 12:08 AM

ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మరోవైపు లాక్‌డౌన్‌ కాలంలో ఆత్మహత్య, గృహ హింస కేసులు పెద్ద సంఖ్యలో పెరిగినట్లు

లాక్‌డౌన్‌ కాలంలో పెరిగిన ఆత్మహత్య, గృహ హింస కేసులు..
Follow us on

Domestic Violence: ఓవైపు కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఇప్పుడు భారత్ లో రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మరోవైపు లాక్‌డౌన్‌ కాలంలో ఆత్మహత్య, గృహ హింస కేసులు పెద్ద సంఖ్యలో పెరిగినట్లు గణాంకాల ద్వారా తెలుస్తున్నది. ఒక్క పంజాబ్‌లోని లుధియానాలోనే లాక్‌డౌన్‌ కాలంలో వంద ఆత్మహత్య, 1500 గృహ హింస కేసులు నమోదైనట్లు డీసీపీ అఖిల్‌ చౌదరి తెలిపారు. ఈ ఏడాది లాక్‌డౌన్‌కు ముందు వీటి సంఖ్య చాలా తక్కువగా ఉన్నదని ఆయన చెప్పారు. లాక్‌డౌన్‌కు ముందు 60 ఆత్మహత్య, 850 గృహహింస కేసులు నమోదైనట్లు వివరించారు.

డిప్రెషన్, మానసిక ఒత్తిడి, నిరుద్యోగం, ఆర్థిక కారణాల వల్ల చాలా మంది ఆత్మహత్యకు పాల్పడినట్లు తమ దర్యాప్తులో గమనించామని డీసీపీ అఖిల్‌ చౌదరి చెప్పారు. 30-40 ఏళ్ల వయసువారిలో ఆత్మహత్య భావం ఎక్కువగా ఉన్నట్లు తమ పరిశీలనలో గ్రహించినట్లు ఆయన తెలిపారు. లాక్‌డౌన్‌ వల్ల భార్యభర్తలు ఇళ్ళలోనే ఉన్న నేపథ్యంలో గృహ హింస కేసులు కూడా ఎక్కువగా వెలుగుచూసినట్లు పేర్కొన్నారు.

Also Read: కరోనా కేర్ సెంటర్‌గా.. కోరమంగళ ఇండోర్ స్టేడియం..