ఐపీఎల్ 2020: 10 సెక‌న్ల యాడ్‌కు రూ.10 ల‌క్ష‌లు..!

దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కారణంగా చాలా ఈవెంట్లు రద్దయ్యాయి. ఈ క్రమంలో ఐపీఎల్ 2020 హంగామా మరికొద్ది రోజుల్లోనే మొదలుకాబోతోంది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి

  • Tv9 Telugu
  • Publish Date - 9:26 am, Sat, 15 August 20
ఐపీఎల్ 2020: 10 సెక‌న్ల యాడ్‌కు రూ.10 ల‌క్ష‌లు..!

IPL broadcaster Star Sports: దేశంలో కోవిద్-19 విలయతాండవం చేస్తోంది. ఈ మహమ్మారి కారణంగా చాలా ఈవెంట్లు రద్దయ్యాయి. ఈ క్రమంలో ఐపీఎల్ 2020 హంగామా మరికొద్ది రోజుల్లోనే మొదలుకాబోతోంది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ జరగనున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది.

కరోనా కట్టడికోసం.. ప్రేక్షకులను స్టేడియాల్లోకి అనుమతించడంలేదు. దీంతో టీవీల్లో వ్యూవర్‌షిప్‌ రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో స్టార్‌స్పోర్ట్స్‌ 10 సెకన్ల యాడ్‌కి రూ.10 లక్షల ధరని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ మధ్యలోనే దసరా, దీపావళి కూడా వస్తుండటంతో.. యాడ్స్‌ ఇచ్చేందుకు కంపెనీలు కూడా పోటీపడే అవకాశం ఉంది. ఐపీఎల్ 2019 సీజన్‌లో యాడ్స్‌ ద్వారా స్టార్‌స్పోర్ట్స్ రూ.3000 కోట్లు ఆదాయం ఆర్జించినట్లు గణాంకాలు చెప్తున్నాయి.

Also Read: తెలంగాణలో అతి భారీ వర్షాలు.. రికార్డు స్థాయిలో 27 సెంటీమీటర్లు..!