జేపీ నడ్డా కాదు..అబద్దాల అడ్డాః కేటీఆర్
కర్నాటకలో బీజేపీ చేసిన నాటకాలు ఇక్కడా కొనసాగించాలని చూస్తోందంటూ కమలం పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కటీఆర్. కూకట్‌పల్లిలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ ఎన్నిస్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిందో చూసుకోవాలని ఎద్దేవా చేశారు. మోదీ ప్రచారం చేసినా బీజేపీ ఒక్క స్థానానికే పరిమితమైందన్నారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటే బీజేపీ, కాంగ్రెస్‌కు నచ్చదన్నారు. బీజేపీ నడ్డా కాదు.. పచ్చి అబద్దాల అడ్డా అని ఆరోపించారు కేటీఆర్. బీజేపీ నిర్వహించిన […]

కర్నాటకలో బీజేపీ చేసిన నాటకాలు ఇక్కడా కొనసాగించాలని చూస్తోందంటూ కమలం పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కటీఆర్. కూకట్‌పల్లిలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ ఎన్నిస్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిందో చూసుకోవాలని ఎద్దేవా చేశారు. మోదీ ప్రచారం చేసినా బీజేపీ ఒక్క స్థానానికే పరిమితమైందన్నారు. హైదరాబాద్ ప్రశాంతంగా ఉంటే బీజేపీ, కాంగ్రెస్‌కు నచ్చదన్నారు. బీజేపీ నడ్డా కాదు.. పచ్చి అబద్దాల అడ్డా అని ఆరోపించారు కేటీఆర్. బీజేపీ నిర్వహించిన మహా సమ్మేళనం భారీ బహిరంగ సభలో బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా చేసిన ఆరోపణలకు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. తమ ప్రభుత్వం అవినీతి పాల్పడిందని ఆరోపణలు చేయడం కాదు..అవినీతిపై ఆధారాలుంటే బయటపెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.