కోవిడ్ హాట్‌స్పాట్‌గా బాక్సింగ్ డే టెస్టు.. హాజరైన అభిమానికి పాజిటివ్.. వేలల్లో ప్రేక్షకులు ఐసోలేషన్‌కు..!

India vs Australia 2020: బాక్సింగ్ డే టెస్టు రెండు రోజు హాజరైన ఓ అభిమానికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు మెల్‌బోర్న్ క్రికెట్ క్లబ్ బుధవారం..

కోవిడ్ హాట్‌స్పాట్‌గా బాక్సింగ్ డే టెస్టు.. హాజరైన అభిమానికి పాజిటివ్.. వేలల్లో ప్రేక్షకులు ఐసోలేషన్‌కు..!
Follow us

|

Updated on: Jan 06, 2021 | 6:16 PM

India vs Australia 2020: బాక్సింగ్ డే టెస్టు రెండు రోజు హాజరైన ఓ అభిమానికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు మెల్‌బోర్న్ క్రికెట్ క్లబ్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే మ్యాచ్‌కు హాజరైన సమయంలో సదరు వ్యక్తికి కరోనా సోకలేదని.. ఆ తర్వాత వైరస్ బారిన పడ్డాడని వెల్లడించింది.

ఇదిలా ఉంటే ఈ విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన మెల్‌బోర్న్ ప్రభుత్వం ఆ రోజు(డిసెంబర్ 27) గ్రేట్ సాథర్న్ స్టాండ్‌లోని జోన్-5లో మధ్యాహ్నం 12.30 నుంచి 3.30 గంటల మధ్య కూర్చుకున్న ప్రేక్షకులు కరోనా టెస్టు చేయించుకోవాలని.. నెగటివ్ రిపోర్ట్ వచ్చే వరకు హోం ఐసోలేషన్‌లో ఉండాలని వైద్యశాఖ స్పష్టం చేసింది. ”బాక్సింగ్ డే టెస్టు ప్రతీ రోజూ స్టేడియంను మైదాన సిబ్బంది శానిటైజ్ చేస్తుందని.. వేదిక అంతటా 275 హ్యాండ్ శానిటైజింగ్ స్టాండ్స్ అమర్చామని” మెల్‌బోర్న్ క్రికెట్ క్లబ్ పేర్కొంది.

కాగా, ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వం మూడో టెస్టుకు కఠినతరమైన నిబంధనలు అమలులోకి తీసుకొచ్చింది. సిడ్నీలో జరగబోయే మూడో టెస్టుకు హాజరయ్యే అభిమానులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించింది. నిబంధనలను అతిక్రమిస్తే 1000 డాలర్ల ఫైన్ చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. అటు సిడ్నీలో కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో మూడో టెస్టుకు 25 శాతం మంది ప్రేక్షకులను మాత్రమే అనుమతించాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించింది.

Also Read:

కరోనా వ్యాక్సిన్.. జనవరి 13 నుంచి దేశమంతటా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం..!

మందుబాబులకు స్ట్రాంగ్ వార్నింగ్.. ఇకపై మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానాయే కాదు..

ఆసుపత్రుల్లోని గాలిలో కరోనా వైరస్.. సీసీఎంబీ రీసెర్చ్‌లో సంచలన విషయాలు వెల్లడి.!