New Zealand Crush Pakistan: కొత్త సంవత్సరం న్యూజిలాండ్ టీంకు బాగా కలిసొచ్చింది. ఆ జట్టు టెస్టుల్లో అగ్రస్థానానికి ఎగబాకింది. పాకిస్థాన్‌పై రెండో టెస్టులోనూ విజయం సాధించడంతో ఈ ఫీట్ అందుకుంది. ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
రెండో టెస్టులో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. 297 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ జట్టు.. విలియమ్సన్(238) డబుల్ సెంచరీతో పాటు నికోలస్(157), డారీ మిచెల్(102) సూపర్ సెంచరీల సహాయంతో 659 పరుగుల భారీ స్కోర్ చేయగలిగింది. ఆ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్.. 186 పరుగులకు ఆలౌట్ అయింది. దీనితో కివీస్ ఇన్నింగ్స్ 176 పరుగుల తేడాతో అద్బుత విజయాన్ని నమోదు చేసుకోవడమే కాకుండా సిరీస్‌ను 2-0తో క్లీన్ స్వీప్ చేసింది.
Also Read:
కరోనా వ్యాక్సిన్.. జనవరి 13 నుంచి దేశమంతటా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం..!
మందుబాబులకు స్ట్రాంగ్ వార్నింగ్.. ఇకపై మద్యం సేవించి వాహనం నడిపితే జరిమానాయే కాదు..
ఆసుపత్రుల్లోని గాలిలో కరోనా వైరస్.. సీసీఎంబీ రీసెర్చ్‌లో సంచలన విషయాలు వెల్లడి.!