స్టూడెంట్స్‌కైనా, ఉద్యోగులకైనా వీకెండ్ ముగిసి.. మండే మళ్లీ పని మొదలు పెట్టాలంటే.. ఎక్కడలేని నీరసాలు వచ్చేస్తాయి. మరీ ముఖ్యంగా ఉద్యోగులైతే సోమవారం రోజున బద్ధకంతో ఆఫీసులకు వెళ్తారు. మ్యాగ్జిమం ప్రతీ ఒక్కరిలోనూ ఇదే ఫీలింగ్. అందుకే మండే వస్తే చాలు.. ట్విట్టర్‌లో #MondayBlues, #MondayMorningBlues లాంటి హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ అవుతుంటాయి. ప్రతీ వారం ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండింగ్.
అందుకేనేమో గిన్నిస్ బుక్ సైతం ఈ విషయాన్ని గుర్తించింది. సోమవారాన్ని ‘వరస్ట్ డే ఆఫ్ ది వీక్’గా ప్రకటిస్తూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. ఇలా పోస్ట్ చేశారో లేదో.. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి ఫన్నీ కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.
‘వరస్ట్ డే సోమవారం.. పర్ఫెక్ట్’ అని కొందరు కామెంట్ చేయగా.. ‘సూపర్’ అంటూ మరికొందరు రాసుకొచ్చారు. ‘నాలుగైదు రోజులకు పైగా సెలవుల తర్వాత వచ్చే ఏ రోజైనా కూడా వరస్ట్ డేనే’ అని ఇంకొందరు అన్నారు. మరి దీనిపై మీరేమంటారు.
we’re officially giving monday the record of the worst day of the week
— Guinness World Records (@GWR) October 17, 2022