Cars : ఇకపై కార్లలో ఆ టూల్ కిట్ లేనట్టే.. పూర్తి వివరాలు ఇవే

స్టెపినీ టైర్, పంచర్ కిట్ లేకుండా దూర ప్రయాణం చేయడం ఒక రకంగా సాహసమే. టు వీలర్ అయిన ఫోర్ వీలర్ అయిన కంపెనీతో పాటే స్టెపిని టైర్, జాకీ, పంచర్ కిట్ కచ్చితంగా వస్తుంది. అంత ఎందుకు అన్ని కార్లలో ఈ పంచర్ కిట్ పెట్టుకోవడానికి ప్రత్యేకంగా ప్లేస్ కూడా డిజైన్ చేస్తారు. దాదాపుగా కార్లు కనిపెట్టినప్పటి నుంచి ఎలక్ట్రిక్ కార్లు ఉత్పత్తి చేస్తున్న ఈ జనరేషన్ వరకు అన్ని మారిన కార్లలో పంచర్ కిట్ మాత్రం అలాగే కొనసాగింది.

Cars : ఇకపై కార్లలో ఆ టూల్ కిట్ లేనట్టే.. పూర్తి వివరాలు ఇవే
Car

Edited By:

Updated on: Nov 16, 2023 | 1:42 PM

కారులో పెట్రోల్ ఎంత ముఖ్యమో.. టైరుకు పంచర్ కాకుండా చూసుకోవడం అనే ముఖ్యం. అయితే పంచర్ ను అతికించుకునేందుకు పంచర్ కిట్ ఉండాల్సిందే. స్టెపినీ టైర్, పంచర్ కిట్ లేకుండా దూర ప్రయాణం చేయడం ఒక రకంగా సాహసమే. టు వీలర్ అయిన ఫోర్ వీలర్ అయిన కంపెనీతో పాటే స్టెపిని టైర్, జాకీ, పంచర్ కిట్ కచ్చితంగా వస్తుంది. అంత ఎందుకు అన్ని కార్లలో ఈ పంచర్ కిట్ పెట్టుకోవడానికి ప్రత్యేకంగా ప్లేస్ కూడా డిజైన్ చేస్తారు. దాదాపుగా కార్లు కనిపెట్టినప్పటి నుంచి ఎలక్ట్రిక్ కార్లు ఉత్పత్తి చేస్తున్న ఈ జనరేషన్ వరకు అన్ని మారిన కార్లలో పంచర్ కిట్ మాత్రం అలాగే కొనసాగింది. ఈ దశాబ్దాల పంచర్ కిట్టుకు ఇక చెక్ పడనుంది.

కొత్త కార్లలో జాకీ, స్పానర్లు, టైరు పంచర్ అతికించే కిట్లను నిలిపివేస్తున్నాయి కంపెనీలు. ఇప్పటికే టాటా కంపెనీ ఉత్పత్తి చేస్తున్న పంచ్, ఆల్ట్రోస్, టియాగో మోడల్లలో ఈ పంచర్ కిట్లను ఇవ్వడం లేదు. వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి అన్ని కార్లలో నిలిపివేస్తున్నట్లు టాటా తెలిపింది. ఇక ఇదే బాటలో కొత్త కార్లలో పంచర్ కిట్లను నిలిపివేయనుంది మారుతి. దాదాపుగా అన్ని కార్ల కంపెనీలు కాస్ట్ కటింగ్ కింద ఈ పంచర్ కిట్లను కారుతో పాటు ఇవ్వకుండా నిలిపివేయనున్నాయి.

అయితే కేవలం కాస్ట్ కటింగ్ కాదు మరో కారణం కూడా ఉందంటున్నారు ఆటోమొబైల్ నిపుణులు. ఇప్పుడు వస్తున్న కార్లకు దాదాపుగా అన్ని ట్యూబ్ లెస్ టైర్లే వస్తున్నాయి. ఈ ట్యూబ్ లెస్ టైర్లు పంచర్ అయినా 30 నుంచి 50 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. ఒకవేళ ఎక్కడైనా టైర్ పంచర్ షాప్ కనిపించిన టైర్ విప్పకుండానే ట్యూబ్ లెస్ టైర్ కు పంచర్ వేసే అవకాశం ఉంది. దాంతో పాటు దేశంలో రోడ్ల నాణ్యత కూడా బాగా పెరిగింది. ఇంకో నాలుగైదు ఏళ్లలో ట్యూబ్ ఉన్న టైర్లు మాయం కానున్నాయి. దీంతో ఇక కార్లలో పంచర్ టూల్ కిట్ అనవసరమని కార్ కంపెనీలు భావిస్తున్నాయి. కేవలం స్టెప్ ని మార్చుకునేందుకు ఒక చిన్న జాకీ, స్క్రూలు విప్పేందుకు ఒకే ఒక్క స్పానర్ ఇవ్వనున్నాయి. ఇంకా కొన్ని కంపెనీలు అయితే వాటిని కూడా ఇవ్వడం నిలిపివేయనున్నాయి.