Woman Sticks Cheating Evidence: మనం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వారు మనతో అబద్ధాలు ఆడుతూ, మోసం చేస్తుంటే తట్టుకోవడం చాలా కష్టంతో కూడుకున్న విషయం. మరీ ముఖ్యంగా ప్రేమలో ఉన్న వ్యక్తులు ఒకరిపట్ల మరొకరు ఎంతో నిజాయతీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలా కాకుండా ఒకరితో రిలేషన్‌లో ఉన్నప్పుడు మరొకరితో ప్రేమాయణం నడిపిస్తే తట్టుకోవడం చాలా బాధగా ఉంటుంది.
ఇలాంటి సంఘటలను ఎవరి జీవితంలో ఎదరైనా బాధతో కుంగిపోతారు. ఇక్కడితో జీవితం అయిపోయిందన్నంతలా ఫీలవుతుంటారు. కానీ అమెరికాకు చెందిన ఓ యువతి మాత్రం తన ప్రేమికుడు చేసిన మోసానికి సరైన బుద్ది చెప్పింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు ఓ చెందిన ఎమ్లీ అనే యువతి టిక్‌టాక్ వీడియోలు చేస్తుంటుంది. ఈమె గత కొన్ని రోజులుగా ఓ అబ్బాయితో ప్రేమలో ఉంది. అయితే సదరు బాయ్ ఫ్రెండ్‌కి అంతకుముందు ఓ లవ్ స్టోరీ ఉండేది. కానీ అనుకోని కారణాల వల్ల ఆ అమ్మాయితో బ్రేకప్ కావడంతో.. ప్రస్తుతం ఎమ్లీతో ప్రేమాయణంలో ఉన్నాడు. ఇదిలా ఉంటే ఆ ప్రబుద్ధుడు ఎమ్లీతో రిలేషన్‌లో ఓ ఉన్నా మళ్లీ పాత గర్ల్ ఫ్రెండ్‌తో టచ్‌లో ఉండడం కొనసాగించాడు. ఎప్పుడు తన ఫోన్‌ను టచ్ చేయడానికి వచ్చినా కంగారు పడడాన్ని ఎమ్లీ గమనించింది. దీంతో తన బాయ్ ఫ్రెండ్ పాత గర్ల్‌ఫ్రెండ్‌తో మళ్లీ టచ్‌లోకి వెళుతున్నట్లు అనుమానించిన ఎమ్లీ తన బాయ్ ఫ్రెండ్ మొబైల్ ఫోన్ చాటింగ్‌కు సంబంధించిన స్క్రీన్ షార్ట్‌లను ప్రింట్ తీసింది. ఆ ప్రింట్‌లన్నింటినీ గదిలో గ్లూ సహాయంతో అందంగా అలంకరించింది. అనంతరం తన బాయ్ ఫ్రెండ్‌కు రూమ్‌లో నీకొక సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఉంది అంటూ మెసేజ్ చేసింది. తీరా ఆ గదిని చూసిన ఆ బాయ్ ఫ్రెండ్ బిత్తరపోయాడు. దీంతో తన ప్రేయసిని మోసం చేసినందుకు పశ్చాత్తపడి క్షమాపణలు చెప్పాడు. చూశారుగా కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా తన ప్రేమికుడిని ఎమ్లీ ఎలా మార్చుకుందో.\
Also Read: OU PG EXAMS: విద్యార్థులకు ముఖ్య గమనిక.. పీజీ ఎగ్జామ్ డేట్స్ విడుదల చేసిన ఉస్మానియా యూనివర్సిటీ..