AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈమె థింకింగే నెక్స్ట్ లెవెల్! కేక్‌పై నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ రెజ్యూమ్..

ఈమె తన రెజ్యూమ్ సరికొత్తగా ఉండాలని అనుకుంది. అందుకోసం తనకొచ్చిన వినూత్న ఆలోచన ఆచరణలో పెట్టింది. ప్రసుత్తం అది కాస్తా నెట్టింట వైరల్ అవుతోంది.

ఈమె థింకింగే నెక్స్ట్ లెవెల్! కేక్‌పై నెవ్వర్ బిఫోర్.. ఎవ్వర్ ఆఫ్టర్ రెజ్యూమ్..
Edible Resume On Cake
Ravi Kiran
|

Updated on: Sep 28, 2022 | 1:17 PM

Share

ఒక పని ఇలాగే చేయాలన్న రూల్ ఏమిలేదు. మనకు నచ్చిన విధంగా చేస్తే చాలు. చాలామంది మంచి ఉద్యోగాలు సాధించేందుకు తమ రెజ్యూమ్‌లను సరికొత్తగా తయారు చేస్తుంటారు. ఈ కోవలోనే ఓ మహిళ వినూత్నంగా ఆలోచించింది. తనకు వచ్చిన ఆలోచన ఆచరణలో పెట్టింది. ప్రస్తుతం అది కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకోగా.. అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..

వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని నార్త్ కరోలీనాకు చెందిన కార్లీ పావ్‌లినాక్ బ్లాక్‌బర్న్ అనే మహిళ తన రెజ్యూమ్‌ను సరికొత్తగా తయారు చేసింది. ప్రముఖ కంపెనీ ‘నైక్’లో ఉద్యోగం సాధించేందుకు వినూత్నంగా తన రెజ్యూమ్‌ను కేక్‌పై ప్రింట్ చేయించింది. అనంతరం ఆ కేక్‌ను ‘నైక్’ సంస్థకు పంపించింది. తాను ఎందుకు కేక్‌పై ప్రింట్ చేసిన రెజ్యూమ్‌ను ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ ‘నైక్’ సంస్థకు పంపించిందో.. ఆమె లింక్దిన్(Linkedin) పోస్ట్ ద్వారా నెటిజన్లతో పంచుకుంది.

జస్ట్ డూ ఇట్ డే(JDI Day) కోసం నైక్ సంస్థ భారీ వేడుకను జరుపుకుంది. లేబ్రోన్ జేమ్స్, కొలిన్ కేపెర్నిక్, ఇతర ప్రముఖులు ఈవెంట్‌కు హాజరయ్యారు. అలాంటి పార్టీకి కేక్ పంపడం కంటే మెరుగైన మార్గం ఏముంటుందని.. తన తాను వినూత్నంగా నైక్ సంస్థకు తెలియజేయాలనుకున్నానని.. అందుకే ఇలా చేశానని కార్లీ చెప్పుకొచ్చింది.

ఆ లింక్దిన్ వైరల్ పోస్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కాగా, కార్లీ ఆలోచన ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఆమెను మెచ్చుకోగా.. మరికొందరు విమర్శించారు. ఒక నెటిజన్ ఆమెది ఇంటరెస్టింగ్ యాక్ట్ అంటూ కామెంట్ చేయగా.. ఇది కేవలం జిమ్మిక్ మాత్రమేనని మరొకరు రాసుకొచ్చారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ న్యూస్ కోసం..

Follow Us
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఢిల్లీలో బెస్ట్ ఫ్రెండ్స్.. స్టేట్స్‌లో బిగ్గెస్ట్ ఎనిమీస్!
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
ఈ కూరగాయతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..కంటి చూపు నుండి మధుమేహం వరకు
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
తమిళనాడులో ఉచితాల వేలం పాట.. టాప్‌లో విజయ్.. ప్రజలకు వరాల వర్షం..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఈ సినిమా నేను చేయ్యను అని చెప్పా... కానీ..515 రోజులు ఆడింది..
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
ఆస్కార్ కొరియోగ్రాఫర్ కు అరుదైన గౌరవం.. మైఖేల్ జాక్సన్ తాలూకా..!
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని యాంకరమ్మ..
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
మరణించే ముందు మనిషిలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయి! గరుడ పురాణంలో
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
షణ్ముఖ్ చేతిపై దీపు టాటూ.. కాబోయే భార్య చూసి ఏమన్నదంటే?
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
సింహం పంజా పవర్ ఎట్టుంటుందో తెల్సా..
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.
రూ.400 కోట్లతో నిర్మించిన సినిమా.. దెబ్బకు ఓటీటీ క్రాష్ అయ్యింది.