Busines Idea: బిజినెస్‌ ప్లాన్‌లో ఉన్నారా.? ఇది ట్రై చేయండి, ఢోకా ఉండదు..

అలాంటి ఓ బెస్ట్‌ బిజినెస్‌ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం రోజులు మారిపోతున్నాయి. ఒకప్పుడు పెళ్లిళ్లకు మాత్రమే క్యాటరింగ్‌ను ఎంచుకునే వారు కానీ ప్రస్తుతం ఇంట్లో జరిగే చిన్న చిన్న వేడుకలకు కూడా క్యాటరింగ్‌లను ఆశ్రయిస్తున్నారు. చిన్న చిన్న పట్టణాల్లోనూ...

Busines Idea: బిజినెస్‌ ప్లాన్‌లో ఉన్నారా.? ఇది ట్రై చేయండి, ఢోకా ఉండదు..
Business Idea
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 21, 2024 | 5:29 PM

ఉద్యోగం చేసే ప్రతీ ఒక్కరూ ఏదో ఒక రోజు వ్యాపారాన్ని ప్రారంభించాలనే ఆలోచనతో ఉంటారు. అందుకు అనుగుణంగా తమ మెదడుకు పదును పెడుతుంటారు. అయితే వ్యాపారం అంటే భారీ పెట్టుబడి, శ్రమ, రిస్క్‌తో కూడుకున్న అంశంగా భావిస్తుంటాం. కానీ మంచి ఆలోచన మార్కెట్లో ఉన్న అవసరాలను క్యాష్‌ చేసుకోగలగాలి కానీ వ్యాపారంలో నష్టం అనే మాటే ఉండదు. పైగా మీరు సంపాదిస్తూనే మరో నలుగురికి ఉపాధి కల్పించవచ్చు.

అలాంటి ఓ బెస్ట్‌ బిజినెస్‌ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుతం రోజులు మారిపోతున్నాయి. ఒకప్పుడు పెళ్లిళ్లకు మాత్రమే క్యాటరింగ్‌ను ఎంచుకునే వారు కానీ ప్రస్తుతం ఇంట్లో జరిగే చిన్న చిన్న వేడుకలకు కూడా క్యాటరింగ్‌లను ఆశ్రయిస్తున్నారు. చిన్న చిన్న పట్టణాల్లోనూ క్యాటరింగ్ సేవలు విస్తరించడం, ఇంట్లో స్వయంగా వంటలు చేసే సమయం లేని కారణంగా చాలా మంది క్యాటరింగ్‌వైపు మొగ్గు చూపుతున్నారు. మార్కెట్లో ఉన్న ఈ అవసరాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలు మంచి లాభాలను ఆర్జించవచ్చు.

ఈ బిజినెస్‌ను ప్రారంభించడానికి పెద్దగా ఖర్చు కూడా ఏం అవసరం లేదు. ఎలాగే చిన్న చిన్న ఫంక్షన్స్‌కు ఆర్డర్‌ తీసుకుంటారు కాబట్టి వంటింట్లో ఉండే వస్తువులతో తొలుత బిజినెస్‌ను ప్రారంభించవచ్చు. సుమారు చేతిలో ఒక రూ. 10 వేలు ఉంటే చాలు. ఇందులో కూడా తొలుత మీరు క్యాటరింగ్ సేవలు అందిస్తున్న విషయం పది మందికి తెలియడానికి ప్రకటనలకు అయ్యే ఖర్చు ఎక్కువ ఉంటుంది. మంచి వంట చేసే వారిని పెట్టుకొని, ఒక నలుగురు క్యాటరింగ్ బాయ్స్‌ను ఎంపిక చేసుకుంటే సరిపోతుంది.

మీ పనితనం మీరు చేసే వంటల రుచి ఆధారంగా ఆర్డర్స్‌ పెరుగుతాయి. ముందుగా మీ వ్యాపారాన్ని ప్రచారం చేసుకోవడానికి పలు మార్గాలను ఎంచుకోవాలి. పాంప్లెట్స్‌ వేయడం లోకల్‌ ఛానల్స్‌లో యాడ్స్‌ వేయడం లాంటివి చేయాలి. పెళ్లిళ్లకు ముందు జరిగే చిన్న చిన్న వేడుకలకు మొదలు, పుట్టిన రోజు పార్టీల వరకు ఆర్డర్స్‌ను స్వీకరించొచ్చు. మంచి సీజన్‌లో కనీసం నెలకు అన్ని ఖర్చులు పోను రూ. 50 వేల వరకు సంపాదించొచ్చు. బాగా ప్రచారం జరిగి ఎక్కువ ఆర్డర్లు వస్తే నెలకు రూ. లక్ష వరకు కూడా ఆర్జించవచ్చు. ఇక సొంతింటిలో వంటలు చేసుకునే వీలు ఉండడంతో గది అద్దె చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!