Viral: గోదారోళ్లా మజాకా.! అల్లుడికి 408 రకాల వంటలతో విందు.. అదిరిపోయిందిగా.
గోదావరి జిల్లా వాసులకు వెటకారంతో పాటు మమకారం కూడా ఎక్కువేనన్న మాట తరచు వింటూనే ఉంటాం.ఇంటికి వచ్చిన అతిథులకు మర్యాదలతోనే చంపేస్తారంటూ.. అంటూ సరదాగా కామెంట్స్ సర్వ సాధారణం. కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో గోదోరోళ్ల మర్యాదలు, వంటలు, కొత్త అల్లుళ్లకు ఇచ్చే ఆతిథ్యం గురించి తరచు వీడియోలు కనిపిస్తునే ఉన్నాయి. ఇక సంక్రాంతి సమయంలో కొత్త అల్లుడికి చేసే మర్యాదల గురించి ఎంత చెప్పినా తక్కువే. సంక్రాంతి పండక్కి ప్రతీ సంవత్సరం అల్లుడు అత్తారింటికి వెళ్లాల్సిందే. వారు అందించే అతిథి మర్యాదలు అందుకోవాల్సిందే.
గోదావరి జిల్లా వాసులకు వెటకారంతో పాటు మమకారం కూడా ఎక్కువేనన్న మాట తరచు వింటూనే ఉంటాం.ఇంటికి వచ్చిన అతిథులకు మర్యాదలతోనే చంపేస్తారంటూ.. అంటూ సరదాగా కామెంట్స్ సర్వ సాధారణం. కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో గోదోరోళ్ల మర్యాదలు, వంటలు, కొత్త అల్లుళ్లకు ఇచ్చే ఆతిథ్యం గురించి తరచు వీడియోలు కనిపిస్తునే ఉన్నాయి. ఇక సంక్రాంతి సమయంలో కొత్త అల్లుడికి చేసే మర్యాదల గురించి ఎంత చెప్పినా తక్కువే. సంక్రాంతి పండక్కి ప్రతీ సంవత్సరం అల్లుడు అత్తారింటికి వెళ్లాల్సిందే. వారు అందించే అతిథి మర్యాదలు అందుకోవాల్సిందే. తాజాగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు గ్రామానికి చెందిన ఓ ప్రముఖ వ్యాపారి శ్రీనివాస్ తన కొత్త అల్లుణ్ణి సంక్రాంతి పండగకు ఇంటికి పిలిచి ఏకంగా 408 రకాల పిండి వంటలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. వారి పెళ్లి జరిగి 408 రోజులు కావడంతో 408 రకాల పిండి వంటలతో విందు భోజనం ఏర్పాటు చేశారు. గతంలో వారి వివాహ సమయంలో ఏకంగా రోల్స్ రాయిస్ కారులో ఊరేగించి టాక్ ఆఫ్ ద టౌన్ అయ్యారు. ఇప్పుడు 408 రకాల పిండివంటలతో అల్లుడికి-కూతురికి మర్యాద చేసి మరోసారి గోదారోళ్లా.. మజాకా.. అని అనిపించుకున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
కదిలే కారులోకి దూసుకొచ్చిన అడవి మృగం..తల్లి ఒడిలోని చిన్నారి మృతి
600 ఏళ్ల నాటి వినాయక విగ్రహం లభ్యం
నేను హర్ట్ అయ్యాను.. సంగారెడ్డి MLA గా పోటీ చెయ్యను : జగ్గారెడ్డి
నెల రోజులు షుగర్ మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా?
అత్తోళ్ళా.. మజాకా..! సంక్రాంతి అల్లుడికి వయసుకు తగ్గట్టు వంటకాలు.
తగ్గినట్టే తగ్గి ఒక్కసారిగా పెరిగిన చలి!
బంగారంపై ఇన్వెస్ట్ చేసేవారికి అలెర్ట్

