Wild Life: సెక్స్ కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టే జీవి.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..!
శృంగారంలో పాల్గొనడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు అనేక సందర్భాల్లో చెబుతుంటారు. అయితే, ఇది మనుషులకు మాత్రమే. మరి జంతువుల గురించి ఎప్పుడైనా ఆలోచించారా?
శృంగారంలో పాల్గొనడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు అనేక సందర్భాల్లో చెబుతుంటారు. అయితే, ఇది మనుషులకు మాత్రమే. మరి జంతువుల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? జంతువులకు సంబంధించిన శృంగార జీవితం ఎలా ఉంటుంది? వాటి ఆరోగ్య పరిస్థితి ఏంటి? శృంగారం వాటి ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అనే ఆలోచన ఎప్పుడైనా తట్టిందా? తాజాగా ఓ పరిశోధనలో తేలిన షాకింగ్ విషయాన్ని మీ ముందుకు తీసుకువస్తున్నాం. అదేంటో చూసేయండి.
అంతరించిపోతున్న మగ నార్త్ కోల్స్(ఎలుక జాతి) సెక్స్ కోసం నిద్ర కూడా పోవడం లేదట. అదే వాటిపాలిట యమపాశంలా మారిందని పరిశోధకులు చెబుతున్నారు. నార్త్ కోల్స్ అంతరించిపోవడంపై ఆస్ట్రేలియాలోని కొందరు సైంటిస్టులు పరిశోధనలు జరిపారు. ఈ పరిశోధనలో షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. దీని ప్రకారం.. సంభోగం కోసం ఆడ నార్త్ కోల్స్ కోసం మగ నార్త కోల్స్ విపరీతంగా వెతుకుతాయి. వాటితో శృంగారం కోసం ఎంత దూరమైనా ప్రయాణిస్తాయి. ఈ ప్రక్రియలో అవి నిద్రకూడా పోవట. ఇలా నిద్రలేకపోవడం, విశ్రాంతి లేకపోవడం వల్ల అవి ప్రాణాలు కోల్పోతున్నాయని తేల్చారు పరిశోధకులు. ఈ కారణంగానే ఒక సంతానోత్పత్తి కాలంలోనే మగ నార్త్ కోల్స్ చనిపోతున్నాయని నిర్ధారించారు. ఇక ఆడ నార్త్ కోల్స్ జీవిత కాలం 4 సంవత్సరాలు ఉంటుందని, ఇవి పునరుత్పత్తి కూడా చేయగలవని పేర్కొన్నారు.
ఆస్ట్రేలియాలోని నార్తర్న్ టెరిటరీ తీరంలో ఉన్న గ్రూట్ ఐలాండ్‌లో వైల్డ్ రోమింగ్ కోల్స్‌పై పరిశోధనలు జరిపారు. మగ, ఆడ కోల్స్‌కు బ్యాక్‌ప్యాక్‌లలో సెన్సార్స్ ఏర్పాటు చేుసి 42 రోజుల పాటు పరిశీలించారు. ఆ డేటానే సేకరించి పరిశోధించగా.. సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఇవి ఒక రాత్రిలో దాదాపు 10 కిలోమీటర్ల పైగానే నడిచాయని గుర్తించారు. ఇక ఈ మగ కోల్స్ పరాన్నజీవులను ఆకర్షించేలా ప్రవర్తిస్తాయట. ఇది కూడా వాటి మరణానికి కారణంగా చెబుతున్నారు. ఇతర జంతువులకు చిక్కకుండా ఎలాంటి అప్రమత్తతతో కూడిన జాగ్రత్తలు తీసుకోదని పరిశోధకులు చెబుతున్నారు.
వారు అధ్యయనం చేసిన కొన్ని క్యూల్స్ ఒక రాత్రిలో 10 కిమీ కంటే ఎక్కువ నడిచాయి, ఇది సగటు స్ట్రైడ్ పొడవు ఆధారంగా దాదాపు 40 కిమీ మానవ దూరం అని అనువదిస్తుంది, అధ్యయనం తెలిపింది. జాతుల మగవారు కూడా ఎక్కువ పరాన్నజీవులను ఆకర్షించేలా కనిపించారు. చాలా మటుకు కారణం: వారు వస్త్రధారణకు తక్కువ సమయాన్ని కేటాయిస్తారు, తద్వారా వారు ప్రతి సంతానోత్పత్తి సీజన్‌ను ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు. ఆహారం కోసం వెతుకుతున్నప్పుడు లేదా వేటాడే జంతువులను నివారించేటప్పుడు మగవారు ఆడవారి వలె అప్రమత్తంగా ఉండరని పరిశోధకులు తెలిపారు.
‘మగ కోల్స్ వీలైనంత తరచుగా సంభోగం చేయడానికి ఎక్కువ దూరం ప్రయాణిస్తాయి. వాటి డ్రైవ్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్నట్ల తేలింది. ఆడ కోల్స్‌ను వెతకడానికే వాటికి ఎక్కువ సమయం పడుతుంది. ఈ క్రమంలో అవి నిద్రను కూడా వదులుకుంటాయి.’ అని సన్‌షైన్ కోస్ట్ విశ్వవిద్యాలయంలో సీనియర్ లెక్చరర్ క్రిస్టోఫర్ క్లెమెంట్ తెలిపారు. ఇక ఈ అధ్యయనం క్వీన్స్‌లాండ్ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగింది. అధ్యయన వివరాలను యూనివర్సిటీ తాజాగా ప్రకటించింది.
ఆస్ట్రేలియన్ వైల్డ్‌లైఫ్ కన్జర్వెన్సీ ప్రకారం.. దాదాపు 100,000 నార్త్ కోల్స్ ప్రస్తుతం జీవించి ఉన్నాయి. కానీ వీటి సంఖ్య అత్యంగా వేగంగా క్షీణిస్తోందని పరిశోధకులు గుర్తించారు. అభివృద్ధి పేరుతో అడవుల నరికివేత, పిల్లుల దాడుల కారణంగా అవి ఆవాసాలను కోల్పోతున్నాయి. దాంతో వాటి మనుగడ కష్టంగా మారింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..