Dog: కుక్కలు నాలుకను ఎందుకు బయటకు తీస్తాయో తెలుసా.. దీని వెనుక పెద్ద కారణమే ఉంది..

|

Mar 21, 2023 | 11:41 AM

"నాలుగు కాళ్ల స్నేహితుడు" అనే పదం వింటే వెంటనే ఈ కుక్క మీ కళ్ల ముందు కనిపిస్తుంది. చాలా ఎక్కువ కాలం పాటు ఒక వ్యక్తితో పక్కపక్కనే జీవిస్తుంది. ప్రతి విషయంలో..

Dog: కుక్కలు నాలుకను ఎందుకు బయటకు తీస్తాయో తెలుసా.. దీని వెనుక పెద్ద కారణమే ఉంది..
Dogs
Follow us on

కుక్కలను మనిషికి అత్యంత నమ్మకమైన సహచరులని చెబుతారు.ఇంట్లో ఓ సభ్యుడుగా పరిగణిస్తారు. ఈ జంతువు చాలా ప్రత్యేకమైనది. దానికి కట్టుబడి ఉంటుంది. యజమాని పట్ల విధేయతతో జీవిస్తుంది. కుక్క మానవుడు మచ్చిక చేసుకున్న మొట్టమొదటి జంతువు. ఇది ఒక క్షీరదం. సుమారు 14వేల సంవత్సరాల కిందటే ఇది మనిషితో కలిసి జీవించడం నేర్చుకుంది. కుక్కలు అత్యంత నమ్మకంగల జంతువు. అందుకే దానికి మన హృదయంలో గొప్ప స్థానం కల్పిస్తున్నారు. కుక్కలు అత్యంత నమ్మకమైన జీవులు.. అంతే కాదు “నాలుగు కాళ్ల స్నేహితుడు” అనే పదం వింటే వెంటనే ఈ కుక్క మీ కళ్ల ముందు కనిపిస్తుంది. చాలా ఎక్కువ కాలం పాటు ఒక వ్యక్తితో పక్కపక్కనే జీవిస్తుంది. ప్రతి విషయంలో అతనికి సహాయం చేస్తుంది.

అయితే కుక్క రూపం గుర్తుకు రావడంతోనే ముందుగా గుర్తుకువచ్చేది ఓ రూపం. అదే నాలుక బటయకు చాపడం కనిపిస్తుంది. అసలు ఏ జంతువు కూడా తన నాలుకను బయటకు తీయదు. కేవలం కుక్క మాత్రమే నాలుకను బటయకు తీసి కనిపిస్తుంది. అసలు కుక్క నాలుకను ఎందుకు బయటకు చాపుతుందో తెలుసుకుందాం..

వాస్తవానికి, కుక్కల శరీరం మానవులకు భిన్నంగా ఉంటుంది. దానిలోని అన్ని కార్యకలాపాలు కూడా మానవులకు భిన్నంగా ఉంటాయి. వేసవి కాలంలో మనకు వేడిగా అనిపించినప్పుడు.. శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి మన శరీరం చెమటలు పట్టిస్తుంది. మన శరీరంలో, చర్మం కింద చెమట గ్రంథులు ఉంటాయి. అంటే చెమట గ్రంథులు.. అవి చెమటను ఉత్పత్తి చేస్తాయి. వేసవి కాలంలో మాత్రమే కుక్కలు తమ నాలుకను బయటకు చాపడం ద్వారా ఎక్కువగా ఉక్కిరిబిక్కిరి అవుతాయని మీరు గమనించాలి. నిజానికి, వాటి శరీరంలో చెమట గ్రంథులు కనిపించవు. దీని కారణంగా వారి శరీర ఉష్ణోగ్రత నియంత్రించబడదు. అప్పుడు అది తన నాలుకను బయటకు తీసి, ఊపిరి పీల్చుకుంటూ దానిని నియంత్రించడానికి ప్రయత్నిస్తాయి.

పెంపుడు జంతువులను జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం

అజ్ఞానం కారణంగా మన పెంపుడు జంతువులు ఏదైనా భిన్నమైన ప్రవర్తనను విస్మరించడం తరచుగా మనం పొరపాటు చేస్తాం. దీని వల్ల అవి చాలాసార్లు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే మూగ జీవుల సమస్యలను కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి.

ప్రవర్తన మార్పును తేలికగా తీసుకోకండి

మీ పెంపుడు జంతువు ప్రవర్తనలో ఏదైనా మార్పు కనిపిస్తే.. సంబంధిత పశువైద్యుడిని సంప్రదించండి. దీనితో పాటు, మీ పెంపుడు జంతువు ఏ సందర్భంలో ఎలా ప్రవర్తిస్తుందో కూడా మీరు తెలుసుకోవాలి. సాధారణంగా, కుక్కలు ఎక్కువ వేడిని అనుభవిస్తాయి. ముఖ్యంగా యూరోపియన్ జాతి కుక్కలు వేడితో ఎక్కువ బాధపడతాయి. అందుకే వీలైనన్ని ఎక్కువ చల్లని వాతావరణం వారికి అందుబాటులో ఉంచాలి.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం