AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Funeral : అంత్యక్రియల తర్వాత తల స్నానం ఎందుకు చేస్తారంటే..?

అంత్యక్రియలు, దహన సంస్కారాలకు సంబంధించి హిందువులు అనేక నియమాలు పాటిస్తారు. దహన సంస్కారాల అనంతరం కుటుంబ సభ్యులు, వారసులు స్నానం చేస్తారు. . ఈ ఆచారం వెనుక మతపరమైన ఆచారంతో పాటు శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Funeral : అంత్యక్రియల తర్వాత తల స్నానం ఎందుకు చేస్తారంటే..?
Funeral
Ram Naramaneni
|

Updated on: Jan 29, 2024 | 1:40 PM

Share

అయినవారు ఎవరైనా మరణిస్తే.. పాటించే ఆచారాల్ని బట్టి అంత్యక్రియలు నిర్వహిస్తుంటారు వారి కుటుంబ సభ్యులు. అయితే దహన కార్యక్రమం అయిన అనంతరం… పూర్వం దగ్గర్లోని కాలువ లేదా చెరువు వద్దకు వెళ్లి తల స్నానం చేస్తారు. ఇప్పుడు స్నానం చేసేందుకు స్మశాన వాటికల్లోనే పంప్స్, బోర్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇలా స్నానం చేయడం తరతరాలుగా వస్తున్న ఆనవాయితీ. ఇలా స్నానం చేయడం ఎందుకు అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా..? అందుకు చాలా కారణాలు ఉన్నాయ్. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం…

  1. ఆత్మీయులు చనిపోయినప్పుడు దు:ఖం తన్నుకువస్తుంది. ఆ మనిషితో  గడిపిన క్షణాలు, చేసుకున్న జ్ఞాపకాలు, పంచుకున్న మాటలు గుర్తుకు వస్తాయి. ఇక వారు మనతో ఉండరు అనే ఆలోచన మన శరీరంలోని అణువణువునూ బాధిస్తుంది. కొంతమంది గుక్కెట్టి ఏడుస్తారు. మరికొందరు పంటిబిగువున బాధను భరిస్తూ.. లోలోపల కుంగిపోతారు. ఆ సమయంలో మెదడు, శరీరంపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. అలాంటి సమయంలో తల స్నానం చేయడం వల్ల కొంతమేర స్వాంతన లభిస్తుంది.
  2. హిందువుల్లో చాలామంది శ్మశాన వాటికలో ప్రతికూల ప్రభావం ఉంటుందని భావిస్తారు. చనిపోయిన వ్యక్తికి దహన సంస్కారాలు నిర్వహించిన తర్వాత.. ఆ ప్రతికూల భావనలను మన నుంచి తొలగించుకోవడానికి స్నానం చేయాలని అంటారు.
  3. వ్యక్తి మరణించిన వెంటనే అంత్యక్రియలు చేయరు. బంధుమిత్రులు అందరూ వచ్చేవరకు మృతదేహాన్ని అలానే ఉంచుతారు. ఈ సమయంలో ఆ బాడీలో బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది.  ఆ శరీరాన్ని తాకిన వారికి అది స్ప్రెడ్ అవుతుంది. అందుకే.. చనిపోయిన వ్యక్తికి దహన సంస్కారాలు నిర్వహించిన తర్వాత స్నానం చేయాలని చెబుతుంటారు. పూర్వ కాలంలో ఎక్కువగా అంటు వ్యాధులతో జనాలు చనిపోయేవారు. ఆ రోగాలు ఇతరులకు సోకకుండా ఉండటానికి, దహన సంస్కారాల తర్వాత స్నానాన్ని ఆచార, సంప్రదాయాల్లో భాగం చేశారని పూర్వికులు చెబుతుంటారు
  4. మనకు కావాల్సినవారు చనిపోతే ఎవ్వరైనా షాక్‌ గురవుతారు. ఆ బాధ నుంచి కోలుకోవడంలో తల స్నానం ముఖ్యపాత్ర పోషిస్తుందని చెబుతుంటారు. ఆ సమయంలో తలస్నానం  చేయడం వల్ల.. ఆ జ్ఞాపకాలను కొంత వరకు పక్కనపెట్టే అవకాశం కలుగుతుందట.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..