Horoscope Today: వారికి అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది.. 12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు..

దిన ఫలాలు (జనవరి 30, 2024): మేష రాశి వారికి వృత్తి జీవితం లాభదాయకంగా సాగిపోతుంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. మిథున రాశి వారి మాటకు ఇంటా బయటా మరింతగా విలువ పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Horoscope Today: వారికి అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది.. 12 రాశుల వారికి మంగళవారం రాశిఫలాలు..
Horoscope Today 30th January 2024
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Jan 30, 2024 | 5:01 AM

దిన ఫలాలు (జనవరి 30, 2024): మేష రాశి వారికి వృత్తి జీవితం లాభదాయకంగా సాగిపోతుంది. వృషభ రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. మిథున రాశి వారి మాటకు ఇంటా బయటా మరింతగా విలువ పెరుగుతుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి మంగళవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1)

శుభ గ్రహాల బలం బాగా అనుకూలంగా ఉన్నందువల్ల ఉద్యోగంలో మీ మాటకు తిరుగుండదు. వృత్తి జీవితం లాభదాయకంగా సాగిపోతుంది. వ్యాపారాలు ఆశించిన దాని కంటే ఎక్కువ లాభాలనిస్తాయి. ఆరోగ్యం విషయంలో మరింత శ్రద్ధ తీసుకోవడం మంచిది. బంధువుల వివాదాల్లో తలదూర్చి ఇబ్బంది పడతారు. ఆస్తి వివాదంలో రాజీ మార్గం అనుసరిస్తారు. దూర ప్రాంతాల్లో స్థిరపడిన పిల్లల నుంచి శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు వస్తాయి.

వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2)

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఎక్కువగా ఆర్థిక వ్యవహారాల మీద దృష్టి పెడతారు. మొండి బాకీలు వసూలు చేసుకుంటారు. రాదనుకున్న డబ్బు కూడా కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. అదనపు ఆదాయ మార్గాల విషయంలో ప్రయత్నాలు పెరుగుతాయి. పొదుపు సూత్రాలను క్రమం తప్పకుండా పాటిస్తారు. సతీమణి కెరీర్ పరంగా ఆశించిన పురోగతి సాధిస్తారు. శ్రమ, ఒత్తిడి కారణంగా విశ్రాంతి కరువవుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3)

గ్రహ బలం బాగా అనుకూలంగా ఉంది. ఇంటా బయటా మీ మాటకు మరింతగా విలువ పెరుగుతుంది. కొందరు బంధువుల నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. అనుకున్న పనులను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారాలు అంచనాలకు మించి అనుకూలిస్తాయి. ఉద్యోగాలు ఉత్సాహంగా కొనసాగుతాయి. వృత్తి జీవితం మూడు పువ్వులు ఆరు కాయలన్నట్టుగా సాగుతుంది. ఆర్థిక వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి.

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)

వృత్తి, ఉద్యోగాల్లో ఆశించిన ప్రోత్సాహం లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాటలో పయనిస్తాయి. . కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొందరు చిన్ననాటి స్నేహితులతో బాగా ఎంజాయ్ చేస్తారు. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. అదనపు ఆదాయ మార్గాలు లాభసాటిగా ముందుకు సాగుతాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉన్నప్పటికీ, ముఖ్యమైన పనులను, వ్యవహారాలను సకాలంలో పూర్తి చేస్తారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)

వృత్తి, ఉద్యోగాలు చాలావరకు సానుకూలంగా సాగిపోతాయి. సహోద్యోగులు, సహచరులు బాగా సహకరిస్తారు. ఇంటా బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి, దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయడం మంచిది కాదు. చేపట్టిన పనులు వేగంగా పూర్తవు తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నాయి. వ్యాపారాలు పరవాలేదనిపిస్తాయి. జీవిత భాగ స్వామికి అదృష్టం పడుతుంది. ఆర్థికంగా కలిసి వస్తుంది. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు.

కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2)

వృత్తి, ఉద్యోగాల్లో కొత్త ప్రాజెక్టులు చేపడతారు. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. తోబుట్టువులతో స్థిరాస్తి వివాదం ఒకటి పరిష్కారం అవుతుంది. కుటుంబ పెద్దల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి. బంధుమిత్రులతో సాన్నిహిత్యం పెరుగుతుంది. ఆకస్మిక ధన లాభ సూచ నలున్నాయి. సతీమణితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆదాయానికి, ఆరోగ్యానికి ఇబ్బంది ఉండదు. పిల్లలు ఆశించిన విధంగా అభివృద్ధిలోకి వస్తారు.

తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3)

ఉద్యోగంలో ప్రాధాన్యం కొనసాగుతుంది. వృత్తి జీవితంలో క్షణం విశ్రాంతి ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి చాలావరకు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆరోగ్య సమస్యలు ఉండక పోవచ్చు. అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. అనేక మార్గాలలో ఆదాయం పెరుగుతుంది. ఎక్కువ సమయాన్ని ఆధ్యాత్మిక చింతనలో గడుపుతారు. ఎవరినీ గుడ్డిగా నమ్మ వద్దు.

వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట)

సమయం బాగా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపారాల్లో శ్రమ తక్కువ, ఫలితం ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగావ కాశాలు అంది వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రులతో సాన్ని హిత్యం పెరుగుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగ స్వామితో కలిసి విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1)

ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది. వ్యాపారాల్లో అంచనాలకు మించి లాభాలు ఆర్జిస్తారు. ఆస్తి వివాదానికి సంబంధించి శుభవార్త అందుతుంది. బంధువులతో సంబంధాలు మెరుగుపడతాయి. అనుకోకుండా మంచి పెళ్లి సంబం ధం నిశ్చయమవుతుంది. ఒకటి రెండు శుభవార్తలు వింటారు. శుభ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. మంచి పరిచయాలు ఏర్పడ తాయి.

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2)

ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఇంట్లో శుభ కార్యాలు నిర్వహించే అవకాశం ఉంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబసమేతంగా ఆలయ సంద ర్శనాలు చేసుకుంటారు. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. నిరుద్యోగులకు ఆశించిన శుభ వార్తలు అందుతాయి. కుటుంబ జీవితంలో సామరస్యం ఏర్పడుతుంది. పిల్లలు వృద్ధిలోకి వస్తారు.

కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3)

వృత్తి, ఉద్యోగాలు సాఫీగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కొత్త వ్యూహాలు సఫలం అవుతాయి. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి శుభ వార్తలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన వ్యవహా రాలు ఉత్సాహంగా సాగిపోతాయి. కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. పిల్లలు మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యానికి ఇబ్బందేమీ ఉండదు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి)

వృత్తి, ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడు తుంది. నిరుద్యోగులు సొంత ఊర్లోనే ఉద్యోగం సంపాదించుకునే అవకాశం ఉంది. వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాలను బాధ్యతగా పూర్తి చేస్తారు. పిల్లల చదువులో మంచి ఫలితాలు సాధి స్తారు. బంధు వర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. చిన్ననాటి స్నేహితులతో కలిసి విందు కార్య క్రమంలో పాల్గొంటారు. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం పరవాలేదు.

ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
ఐఆర్‌సీటీసీ సైట్‌ డౌన్‌ అయితే రైలు టికెట్లను బుక్‌ చేసుకోవడం ఎలా?
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
కొత్త ఫీచర్లతో హోండా యూనికార్న్.. అప్‌డేట్ మోడల్ విడుదల
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
బిచ్చగత్తె చేతిలో అనుమానాస్పద ప్లాస్టిక్ బ్యాగ్.. తెరిచి చూడగా
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
హైడ్రాకు ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో తెలుసా..?
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
బక్కగా ఉన్నవారు బరువు పెరగాలంటే ఇలా చేయండి..
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
వివాదాలు పరిష్కరించుకునేందుకు ఐటీ శాఖ న్యూ స్కీమ్..!
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
ఆసీస్‌పై సెన్సేషనల్ సెంచరీ.. నితీష్ రెడ్డికి భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..