New Born Child: అమానుషం: స్మశానంలో శిశువు ఏడుపులు.. అట్టపెట్టలో బాలుడిని చూసి కాటికాపరి షాక్.. ఏం జరిగిందంటే..!

|

Jul 12, 2021 | 4:58 PM

పిల్లోడి ఏడుపు ఓ అట్టపెట్టెలో నుండి వస్తుందని గమనించి తెరిచి చూశాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ నవజాత శిశువును కాటికాపరి గుర్తించాడు.

New Born Child: అమానుషం: స్మశానంలో శిశువు ఏడుపులు.. అట్టపెట్టలో బాలుడిని చూసి కాటికాపరి షాక్.. ఏం జరిగిందంటే..!
New Born Child In The Cemetery
Follow us on

New Born Child in the Cemetery: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో దారుణం వెలుగు చూసింది. ఓ నెలల బిడ్డ.. శ్మశానంలో గుక్కపెట్టి ఏడుస్తున్నాడు.. ఇది విన్న కాటికాపరి దగ్గరకు వెళ్లి చూడగా, ఆ ఏడుపు ఓ అట్టపెట్టెలో నుండి వస్తుందని గమనించి తెరిచి చూశాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ నవజాత శిశువును కాటికాపరి గుర్తించాడు. వెంటనే స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం శ్మశాన వాటికలో శనివారం అర్ధరాత్రి నవజాత శిశువును గుర్తు తెలియని వ్యక్తులు అట్టపెట్టెలో ఉంచి వెళ్లిపోయారు. పసిబిడ్డ ఏడుపును విన్న కాటికాపరి శివ అట్టపెట్టెలో ఉన్న మగశిశువును గుర్తించి, స్థానికులైన వెంకటేష్‌ దంపతులకు అప్పగించాడు. దీంతో వారు వెంటనే రాజమహేంద్రవరంలోని ప్రత్యేక చిన్న పిల్లల సంరక్షణ యూనిట్‌కు తీసుకెళ్లారు. శిశువు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే 108 నియోనాటల్‌ అంబులెన్సుకు సమాచారం అందించారు.

హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్న 108 సిబ్బంది శిశువుకు అత్యవసర వైద్యాన్ని అందిస్తూ కాకినాడ ఎన్‌ఐసీయూ(నియోనాటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌)కు తరలించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, బరువు సుమారు 750 గ్రాములున్నట్లు ఐసీడీఎస్‌ పీడీ జీవీ సత్యవాణి తెలిపారు. బాబు కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. కాగా, ఇందుకు సంబంధించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనకు సంబంధించి అక్కడికి చేరుకున్న పోలీసులు అసలు తల్లిదండ్రుల కోసం ఆరా తీస్తున్నారు.

Read Also…  Butcher Son: వృద్ధాప్యంలో తనకు జీవనభృతి ఇవ్వాలన్న తల్లి.. బతికుండగానే బొంద పెట్టాలనుకున్న ఓ కసాయి కొడుకు