Viral News: ఆత్మ నిజమేనా.. మరణం తర్వాత ఏమి జరుగుతుంది..? 5 వేల మందిపై జరిపిన పరిశోధనలో తేలింది ఇదే..

|

Sep 01, 2023 | 10:54 AM

ఓ అమెరికాకు చెందిన వైద్యుడు దేవుని అద్భుతాలను విశ్వసించడమే కాకుండా ఆత్మ నిజమేనని, మరణం తరువాత దానికి ఓ జీవితం ఉందని సంచలన ప్రకటన చేశారు. మరణం అంచులవరకూ వెళ్లిన 5 వేల మందిని శాస్త్రీయంగా అధ్యయనం చేశానని, మరణం తర్వాత ఆత్మ ఉనికిని, మరో ప్రపంచాన్ని గుర్తించానని ప్రకటించారు. తాను కూడా స్వర్గం నుండి వచ్చానని  చెప్పుకుంటున్నాడు. 

Viral News: ఆత్మ నిజమేనా.. మరణం తర్వాత ఏమి జరుగుతుంది..? 5 వేల మందిపై జరిపిన పరిశోధనలో తేలింది ఇదే..
Death Experience
Image Credit source: (Pixabay)
Follow us on

మంచి చెడు.. స్వర్గం నరకం అనే నమ్మకాలు భారతీయులకు మాత్రమే కాదు.. ప్రపంచంలో అనేక మంది నమ్ముతారు. కర్మల బట్టి ఫలం ఉంటుందని ముఖ్యంగా ఆసియా దేశాలవారు నమ్మకం. అందుకనే మనిషిగా చేసే కర్మల బట్టి స్వర్గానికి లేదా నరకానికి వెళ్తారని భావిస్తారు. ఇదే విషయాన్ని సినిమాల్లో సీరియల్స్ లో చూస్తూనే ఉంటున్నాం. కొందరు దైవం, దెయ్యం, స్వర్గం , నరకం వంటి వాటిని నమ్మితే.. మరికొందరు వీటి ఉనికిని నమ్మరు సరికదా, అదంతా ట్రాష్ అంటూ కొట్టిపడేస్తారు. ముఖ్యంగా సైన్స్‌పై నమ్మకం ఉన్న వ్యక్తులు, వైద్యులు ఎక్కువగా నమ్మకాలను ప్రశ్నిస్తారు. అయినప్పటికీ కొంతమంది వైద్యులు దైవం మీద నమ్మకంతో ఉంటారు. తాము చేయాల్సిన ప్రయత్నం చేశామని.. ఇక్కడ దేవుడి దయ అని కూడా చెబుతూ ఉంటారు. కొన్ని సార్లు అద్భుతమైన నమ్మలేని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం ఒక వైద్యుడు ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచాడు. తాజాగా ఓ అమెరికాకు చెందిన వైద్యుడు దేవుని అద్భుతాలను విశ్వసించడమే కాకుండా ఆత్మ నిజమేనని, మరణం తరువాత దానికి ఓ జీవితం ఉందని సంచలన ప్రకటన చేశారు. మరణం అంచులవరకూ వెళ్లిన 5 వేల మందిని శాస్త్రీయంగా అధ్యయనం చేశానని, మరణం తర్వాత ఆత్మ ఉనికిని, మరో ప్రపంచాన్ని గుర్తించానని ప్రకటించారు. తాను కూడా స్వర్గం నుండి వచ్చానని  చెప్పుకుంటున్నాడు.

ఈ వైద్యుడి పేరు జెఫ్రీ లాంగ్. అతను రేడియేషన్ ఆంకాలజిస్ట్ .. అమెరికాలోని కెంటకీలో పనిచేస్తున్నాడు. డైలీ స్టార్ నివేదిక ప్రకారం స్వర్గం, నరకం వంటివి ఉన్నాయని తాను నమ్ముతానని డాక్టర్ జెఫ్రీ చెప్పారు. మరణానంతరం వేలాది మంది తిరిగి రావడాన్ని తాను చూశానని, అంటే ఆత్మ ప్రజల శరీరాన్ని విడిచిపెట్టిందని, కానీ అది మళ్లీ శరీరంలోకి వస్తుందని చెప్పాడు. ఇది సైన్స్‌కు మించిన పని అని అంటున్నారు.

5 వేల మందిపై పరిశోధన

ఈ ప్రపంచానికి మించిన స్వర్గం ఉందని డాక్టర్ జెఫ్రీ స్పష్టంగా పేర్కొన్నారు. మరణానికి సమీపంలో ఉన్న 5 వేల మందిని విశ్లేషించినట్లు పేర్కొన్నాడు. మరణం అంచుల వరకూ వెళ్లి తిరిగొచ్చిన ఇలాంటి వారిలో కొందరు తమ శరీరం పనిచేయకపోయినా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడగలిగారని, ఇతరులతో సంభాషించగలిగారని తెలిపారు. కొంతమంది వైద్యపరంగా మరణిస్తారని.. అయితే వారికీ చూసే, వినే సామర్థ్యం ఖచ్చితంగా అలాగే ఉంటుందని ఆయన అన్నారు. మరణానికి సమీపంలో ఉన్నఒక మహిళ శరీరం నుంచి వెలుపలికి వచ్చిన ఆత్మ అక్కడే గాల్లో కాసేపు తచ్చాడిందని.. కొంత సేపు అక్కడ జరుగుతున్న అన్ని విషయాలను ప్రత్యక్షంగా చూస్తూ వినగలిగిందని అయితే ఆమె గుర్రంపై ఎక్కడికో వెళుతున్నట్లు భావించానని చెప్పాడు.

ఇవి కూడా చదవండి

ప్రజలు తమ కథలు చెప్పారు

మరణానికి సమీపంలో ఉన్న మరికొన్ని కథలను వివరిస్తూ.. వైద్యపరంగా చనిపోయిన వ్యక్తి ఒక సొరంగాన్ని చూశాడని, దాని నుండి ప్రకాశవంతమైన కాంతి వెలువడిందని చెప్పాడు. మళ్లీ సజీవంగా వచ్చిన తర్వాత, ప్రకాశిస్తున్న శరీరాన్ని విడిచిపెట్టిన తన ఆత్మను తాను చూశానని చెప్పాడు. చనిపోయిన వ్యక్తి తన బంధువులను కూడా కలిశాడు. కొందరు ఒక ఆత్మ తోటలో తిరుగుతుంటే, కొందరు చీకటి ప్రదేశానికి వెళ్లడం చూశానని పేర్కొన్నాడు.

అయితే తాను చెబుతున్నవి సినిమాల్లో చూపించే సన్నివేశాలు అనిపించినా నిజంగా జరిగినట్లు డా. జెఫ్రీ లాంగ్ స్పష్టం చేశారు. అంతేకాదు తనకు ఎదురైన అనుభవాల్ని శాస్త్రీయంగా వివరించే ఆధారలేవీ దొరకలేదు. అయినప్పటికీ తాను చెప్పినట్లు మనిషి ఆత్మ, మరణం తరువాత జీవితం ఉందని చెప్పారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..