
ఈ రోజుల్లో దాదాపుగా అందరూ అటాచ్డ్ బాత్రూమ్‌లు నిర్మిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం గదిలో అటాచ్డ్ బాత్రూమ్ నిర్మించడం సరైనదా కాదా? వాస్తు శాస్త్రం ప్రకారం బాత్రూమ్ నిర్మించడానికి నియమాలు ఏమిటి? అనే విషయానికి వస్తే.. వాస్తు శాస్త్రం ప్రకారం, ఒక గదిలో అటాచ్డ్ బాత్రూమ్ నిర్మించడం తప్పు కాదని అంటున్నారు. కానీ, దానిని తప్పుడు దిశలో నిర్మించడం వల్ల వాస్తు లోపాలు ఏర్పడతాయి. గదిలో అటాచ్డ్ బాత్రూమ్ నిర్మించడం సరైనదే అయినప్పటికీ దాని దిశ, డ్రైనేజీ వాస్తు సూత్రాలకు అనుగుణంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటికి ఈశాన్యంలో అటాచ్డ్ బాత్రూమ్ నిర్మించడం వల్ల వాస్తు దోషం వస్తుంది. ఈ దిశలో డ్రైనేజీ, అపరిశుభ్రతకు సంబంధించిన ఏలాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేయకూడదు. ఇంటికి నైరుతి దిశలో అటాచ్డ్ బాత్రూమ్ ఉండటం వల్ల స్థిరత్వం తగ్గుతుంది. అయితే, బెడ్ రూమ్ ఈ దిశలో ఉండి బాత్రూమ్ అవసరమైతే, టాయిలెట్ సీటు, డ్రెయిన్, ఎగ్జాస్ట్‌లను దక్షిణ లేదా పశ్చిమ గోడపై ఉంచాలి.
వాస్తు ప్రకారం ఆగ్నేయం లేదా వాయువ్యంలో అటాచ్డ్ బాత్రూమ్ ఉంచడం అనువైనదిగా పరిగణించబడుతుంది. రెండు దిశలు అగ్ని, గాలి అంశాలతో సంబంధం కలిగి ఉంటాయి. అందువల్ల, ఇక్కడ ఉన్న బాత్రూమ్ శక్తులకు అంతరాయం కలిగించదు. బెడ్‌రూమ్ లోపల ఉన్న బాత్రూమ్ తలుపు నేరుగా బెడ్‌పైకి తెరుచుకుంటే అది సమస్యాత్మకంగా ఉంటుంది. వెంటిలేషన్ లేని, నిరంతరం తేమగా ఉండే అటాచ్డ్ బాత్రూమ్ శక్తిని వినియోగిస్తుంది. ఇది అలసట, చిరాకు, నిద్ర సమస్యలకు దారితీస్తుంది.
అయితే, బెడ్‌రూమ్‌లోనే బాత్రూం ఉన్నవారు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా బాత్రూం ఎప్పుడూ క్లీన్‌గా ఉండేలా చూసుకోవాలి. బెడ్‌రూంలోనే బాత్రూం ఉండటం వల్ల బ్యాక్టిరియా త్వరగా వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు ఈ కాలంలో స్నానం చేయడం కూడా అందులోనే చేస్తున్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు బాత్రూం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..