Kitchen Hacks: రైస్ పాడవకుండా ఎలా ఉంచాలి..? ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే..!

ఉదయాన్నే వండిన బియ్యం రాత్రి వరకు పాడవకుండా ఉంచుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలి. ఈ చిన్న చిట్కాలు పాటించడం ద్వారా బియ్యం రుచితో పాటు తేమను కోల్పోకుండా ఉంచటానికి చాలా ఉపయోగ పడుతుంది. పెద్ద వేడుకలు లేదా రోజువారీ వంటకు ఈ చిట్కాలతో అవసరం ఉంటుంది.

Kitchen Hacks: రైస్ పాడవకుండా ఎలా ఉంచాలి..? ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే..!
Cooked Rice

Updated on: Jan 24, 2025 | 10:30 PM

ఉదయాన్నే వండిన రైస్ పాడవకుండా తాజాగా ఉంచుకోవడానికి మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఇది పండగలు, పెళ్లిళ్లు, ఇతర వేడుకల సమయంలో ఉపయోగపడుతుంది. ఈ పద్ధతిని అనుసరించడం ద్వారా రైస్ రుచిగా ఉండడమే కాకుండా.. ఎక్కువసేపు పాడవకుండా ఉంటుంది.

రూమ్ లలో అధిక వేడి కారణంగా మనం వండే రైస్ చాలా త్వరగా పాడవుతుంది. ఉదయం వండిన రైస్ ని మధ్యాహ్నం లేదా రాత్రికి ఉపయోగించే సమయంలో అప్పటికప్పుడే తినలేని పరిస్థితి ఉంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ముఖ్యంగా చాలా సమయం ముందే వండిన రైస్ కి అనుకూలంగా ఉంటుంది.

రైస్ సరిగ్గా ఉడికించడానికి బియ్యం పూర్తిగా మృదువుగా ఉడికిన సమయంలో ఒక టీస్పూన్ కొబ్బరి నూనెను అందులో వేసి కలపాలి. ఇది రైస్ ని పుల్లలు పుల్లులుగా ఉండేలా చేస్తుంది. కొబ్బరి నూనె వాసన కూడా ఉండదు. రైస్ నూనెతో మృదువుగా తయారవ్వడంతో పాటు రుచికరంగా ఉంటుంది.

రైస్ ని వడగట్టిన వెంటనే అదే పాత్రలో ఉంచకూడదు. ఇలా చేస్తే వేడి కారణంగా రైస్ త్వరగా పాడవుతుంది. దీని కోసం ఒక పెద్ద పాత్ర లేదా హాట్ బాక్స్ తీసుకుని దాని లోపల శుభ్రమైన తెల్లని క్లాత్ ని వేయాలి. ఆ తర్వాత వడగట్టిన రైస్ ని క్లాత్ లో పెట్టి, బాగా మూతపెట్టాలి. రైస్ వేడి తగ్గేంతవరకు అలాగే ఉంచితే రైస్ తాజాగా ఉంటుంది. అంతేకాకుండా ఇది వేడి కారణంగా ఉబ్బడం లేదా పాడవ్వడం జరగదు.

ఈ విధానాన్ని పాటిస్తే.. రైస్ పూర్తిగా ఉడికినప్పటికీ అది తినడానికి బాగా మృదువుగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల రోజువారీ ఉపయోగం మాత్రమే కాకుండా పెద్ద కార్యక్రమాల్లో కూడా ఉపయోగపడుతుంది. మీరు ప్రయత్నించి మీ కుటుంబ సభ్యులందరికీ తెలియజేయండి.