పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు పాల ద్వారా లభిస్తాయి. పాలు తాగడం ద్వారా క్యాల్షియం మొదలు ఎన్నో పోషకాలు లభిస్తాయి. పలు రకాల ఆరోగ్య సమస్యలకు కూడా పాలు దివ్యౌషధంలా ఉపయోగపడుతుంది. ఎముకలు, దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే కచ్చితంగా ప్రతీరోజూ పాలను తీసుకోవాలని నిపుణులు సైతం చెబుతుంటారు. అయితే ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే పాలు కొందరికి మాత్రం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పలు రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడే వారు పాలను తీసుకోకపోవడమే బెస్ట్ అని చెబుతున్నారు. ఇంతకీ ఆ సమస్యలు ఏంటంటే..
* శరీరంలో వాపు సమస్య ఉన్న వ్యక్తులు పాల జోలికి అస్సలు వెళ్లకూడదు. పాలలో ఉండే సంతృప్త కొవ్వులు సమస్య మరింత పెరగడానికి కారణంగా మారుతుంది. లిపోపాలిసాకరైడ్స్ అనే ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉన్న సంతృప్త కొవ్వు కారణంగా.. వాపు పెరగడం ప్రారంభమవుతుంది.
* ఇక కాలేయ సమస్యలతో బాధపడే వారు కూడా పాలకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఫ్యాటీ లివర్ లేదా లివర్ వాపు ఉన్న వారు పాలను తాగడం మానుకోవాలి. శరీరంలో కొవ్వుపెరగడం వల్ల జీర్ణం కావడానికి ఇబ్బందులు ఏర్పడుతాయి.
* పీసీఓఎస్ సమస్యతో బాధపడే మహిళలు పాలకు దూరంగా ఉండడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. పాలను ఎక్కువగా తీసుకుంటే.. శరీరంలో ఆండ్రోజెన్, ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. ఇది మహిళల్లో అనారోగ్యాలకు దారి తీస్తుంది.
* ఇక అలర్జీ సమస్యలతో బాధ పడే వారు కూడా పాలు, పాల ఉత్పత్తులకు దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. పాలలో ఉండే లాక్టోస్ శరీరంలో అలెర్జీని పెంచుతుంది. అలాగే పాలలో ఉండే లాక్టోస్ జీర్ణం కాదు. ఇలాంటి వ్యక్తులు పాలు తాగితే.. కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు ఎదురవుతాయి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..