ఆకాశం నవ్వుతుందట..! ఏప్రిల్ 25న చూస్తే ‘స్మైలీ ఫేస్’ హాయ్‌ చెబుతుంది కూడా..

అరుదుగా, ఆకాశంలో గ్రహాల అమరికల వల్ల ఖగోళ అద్భుతాలు జరుగుతాయి. అదేవిధంగా, రేపు అంటే ఏప్రిల్ 25న ఆకాశంలో ఇప్పటి వరకు చూడని ఒక అద్భుత దృశ్యం కనువిందు చేయనుంది. త్రి గ్రహాల కలయిక ఆకాశాన్ని చిరునవ్వుతో వెలిగిస్తుంది. శుక్రుడు, శని, చంద్రవంక కలయిక వల్ల ఆకాశంలో 'స్మైలీ ఫేస్' ఆకారం కనిపిస్తుందట. ఇది ఎప్పుడు కనిపిస్తుంది..? ఎలా వీక్షించాలో పూర్తి వివరాల్లోకి వెళితే..

ఆకాశం నవ్వుతుందట..! ఏప్రిల్ 25న చూస్తే స్మైలీ ఫేస్ హాయ్‌ చెబుతుంది కూడా..
Rare Smiley Face

Updated on: Apr 24, 2025 | 9:34 PM

అంతరిక్షంలో అప్పుడప్పుడు ఊహించని అద్భుతాలు జరుగుతాయి. గ్రహాల అమరికల కారణంగా గతంలోకూడా ఇలాంటి అనేక దృగ్విషయాలు సంభవించాయి. అదేవిధంగా ఏప్రిల్ 25న, అంటే రేపు, ఆకాశంలో ఒక అద్భుతమైన ఖగోళ అద్భుతం కనువిందు చేయనుంది. అవును, రేపు, శుక్రుడు, శని, చంద్రవంక కలయికతో ఒక చిరునవ్వు ముఖం ఆకాశాన్ని వెలిగిస్తుంది. ఈ మూడు గ్రహాల అరుదైన అమరిక ఆకాశంలో ‘ స్మైలీ ఫేస్’ని సృష్టిస్తుంది. ఈ ఖగోళ అద్భుతం రేపు ఉదయం తెల్లవారుజామున కనిపిస్తుంది.

ఏప్రిల్ 25, 2025న, అంటే రేపు ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ఆకాశంలో ‘స్మైలీ ఫేస్’ కనిపిస్తుంది. ఆకాశంలో ఈ నవ్వుతున్న ముఖాన్ని మనందరం కూడా చూడవచ్చు అంటున్నారు. ఈ ఖగోళ అద్భుతం ఒక గంట మాత్రమే కనిపిస్తుంది. శుక్రుడు, శని, చంద్రవంక కలయిక ఆకాశంలో ఒక చిరునవ్వు ముఖాన్ని ఏర్పరుస్తుంది. శుక్రుడు, శని కళ్ళు లాగా ఉండగా, చంద్రవంక నోటి ఆకారంలో కనిపిస్తుంది.

ఏప్రిల్ 25, 2025 ఉదయం శుక్రుడు, శని, చంద్రవంక కలిసి కనిపిస్తాయి. సూర్యోదయానికి ముందు తూర్పున కంటితో ఈ స్మైలీ ముఖం స్పష్టమైన దృశ్యాన్ని చూడవచ్చు. మూడు గ్రహాలు కలిసి కనిపించినప్పుడు దీనిని త్రిగుణ సంయోగం అంటారు. శుక్రుడు, శని, చంద్రుని త్రిగుణ సంయోగం కారణంగా రేపు తెల్లవారుజామున ఆకాశంలో ఒక చిరునవ్వు ముఖం కనిపిస్తుంది. మీరు దీన్ని కంటితో చూడవచ్చు. అదనంగా, మెరుగైన వీక్షణ కోసం మీరు టెలిస్కోప్ లేదా బైనాక్యులర్లతో చూడవచ్చు. దీనికి ముందు, 2008 లో శుక్రుడు, బృహస్పతి, చంద్రుడు కలిసి కనిపించినప్పుడు ఇలాంటి దృశ్యం ఆకాశంలో కనిపించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..