Worst Passwords: మీరు ఈ పాస్ వర్డ్స్ వాడుతున్నారా? సమస్యలు రావద్దంటే వెంటనే మార్చేసుకోండి!
Worst Passwords: ప్రపంచమంతా వేలి కొనలమీద వ్యవహారాలు నడిపించేస్తోంది ఇప్పుడు. ఇంటర్నెట్ తోనే దాదాపుగా ప్రపంచం నడుస్తోంది. దాదాపుగా అందరికీ ఎదో పని కోసం ఇంటర్నెట్ తప్పనిసరి అవసరంగా మారిపోయింది.
ప్రపంచమంతా వేలి కొనలమీద వ్యవహారాలు నడిపించేస్తోంది ఇప్పుడు. ఇంటర్నెట్ తోనే దాదాపుగా ప్రపంచం నడుస్తోంది. దాదాపుగా అందరికీ ఎదో పని కోసం ఇంటర్నెట్ తప్పనిసరి అవసరంగా మారిపోయింది. సోషల్ మీడియా.. ఆన్లైన్ బ్యాంకింగ్.. ఈ కామర్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అవసరాలను ఇంటర్నెట్ తీరుస్తోంది. అదేవిధంగా చాలామంది ఆఫీసు పనుల్లో నెట్ లేకపోతె నడిచే పరిస్థితి లేదు. ఇంటర్నెట్ లో మనం పనిచేసేటప్పుడు లేదా సోషల్ మీడియా లాంటి వాటిని మనం యాక్సెస్ చేయాల్సి వచ్చినపుడు మరీ ముఖ్యంగా బ్యాంకింగ్ కార్యకలాపాల కోసం ఇంటర్నెట్ ఉపయోగించేటప్పుడు మనకు పాస్ వర్డ్ అవసరం అవుతుంది. మన ప్రతి ఎకౌంట్ పాస్ వర్డ్ తోనే తెరుచుకుంటుంది. అంటే..పాస్ వర్డ్ అనేది ఇంటర్నెట్ ద్వారా మనం నిర్వహించే కార్యకలాపాలకు మెయిన్ డోర్ కీ వంటిది. అది ఉంటేనే మనం సంబంధిత కార్యక్రమాన్ని ఇంటర్నెట్ లో సజావుగా నిర్వహించగలుగుతాం.
చాలా మందికి పాస్ వర్డ్ గురించి తెలుసు. అయినా, పాస్ వర్డ్ సెట్ చేసుకునేటప్పుడు కొద్దిపాటి అజాగ్రత్త వహిస్తారు. దానికి ముఖ్యమైన కారణం అది సులువుగా గుర్తుండాలనే. అక్కడే అందరూ ఇంటర్నెట్ దొంగల బారిన పడిపోయే రిస్క్ ను తమ చేతులతో తామే ఏర్పాటు చేసుకుంటారు. మనకి సులువుగా గుర్తుండిపోయే పాస్ వర్డ్ అనుకుంటే.. అది దొంగల చేతికి తాళం ఇచ్చేసినట్టే. ఎందుకంటే..ఇప్పుడు దొంగతనం అంటే మన ఇంటి మీద పడిపోయి ఇంట్లో ఉన్నది ఊడ్చుకుపోవడం కాదు. మన పేరుతోనే.. మన ఎకౌంట్ లోకి దర్జాగా వచ్చేసి.. మనకు తెలీకుండా దోచేసుకోవడమే. అది మన వ్యక్తిగత సమాచారం కావచ్చు.. బ్యాంకులో దాచుకున్న సొమ్ము కావచ్చు.. లేదా మన రహస్య సమాచారం కావచ్చు ఏదైనా సరే సైబర్ నేరగాళ్లు నేరుగా మన నెట్టింట్లోకి చొరబడి పట్టుకుపోవడానికి సిద్ధంగా ఉంటారు. వీరి టార్గెట్ మొదట మన పాస్ వర్డ్. మన ఎకౌంట్ ఐడీ వారికి సులువుగా దొరికిపోతుంది. ఎందుకంటే.. మనం సోషల్ మీడియాలో ఎలానూ అన్ని వివరాలు ఇచ్చేస్తాం. ఇక దానికి మనం పెట్టుకున్న పాస్ వర్డ్ సంపాదించడానికి సైబర్ కేటుగాళ్లు చాలా సులువైన ప్రయత్నాలు చేస్తుంటారు. వారు వీక్ పాస్ వర్డ్ లను వెంటనే పట్టేసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా ప్రజలు కొన్ని పాస్ వర్డ్ లు పెట్టుకుంటారు. అవి కామన్. ముందే చెప్పినట్టు సులువుగా గుర్తుపెట్టుకోవడం కోసమే.
అటువంటి సులువుగా ఉండే పరమ చెత్త పాస్ వర్డ్స్ హ్యాకర్లకు మన ఎకౌంట్లలోకి చొరబడిపోయే అవకాశం ఇస్తాయి. గూగుల్ అలాంటి వాటిలో ఓ ఇరవై అంటే సులువుగా హ్యాకర్ల దొరికిపోయేవి.. అలానే ఎక్కువమంది వాడివి ఏమిటనేది వివరించింది. అవేమిటో మీరూ ఓ లుక్కేయండి.. ఇటువంటి పాస్ వర్డ్ లు మీరు ఎక్కడన్నా ఉపయోగిస్తుంటే వాటిని వెంటనే మార్చేసుకోండి..
గూగుల్ చెప్పిన ఆ ఇరవై పాస్ వర్డ్స్ ఇవీ..
1 | 123456 |
2 | 123456789 |
3 | picture1 |
4 | password |
5 | 12345678 |
6 | 111111 |
7 | 123123 |
8 | 12345 |
9 | 1234567890 |
10 | senha |
11 | 1234567 |
12 | qwerty |
13 | abc123 |
14 | Million2 |
15 | 000000 |
16 | 1234 |
17 | iloveyou |
18 | aaron431 |
19 | password1 |
20 | qqww1122 |
చూసారుగా ఎటువంటి పరిస్థితి లోనూ ఈ పాస్ వర్డ్స్ ఎక్కడా వాడకండి.
Body Building : మీరు డైలీ జిమ్ చేస్తారా..! అయితే కచ్చితంగా ఈ తప్పులు చేయకండి..